Sunday, 08 March 2026 09:42:06 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

'డాకు మ‌హారాజ్' టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి

బాలకృష్ణ, బాబీ కాంబోలో డాకు మహారాజ్‌

Date : 05 January 2025 09:54 AM Views : 355

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నంద‌మూరి బాలకృష్ణ, యువ ద‌ర్శ‌కుడు బాబీ కొల్లి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా డాకు మహారాజ్‌. సంక్రాంతి బ‌రిలో ఉన్న ఈ మూవీ ఈ నెల 12న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రం పాట‌లు, టీజ‌ర్‌, పోస్ట‌ర్స్ డాకు మహారాజ్‌పై అంచ‌నాలు పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం నంద‌మూరి అభిమానులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఏపీ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఈ మేర‌కు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ చిత్రానికి అదనపు షోలకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. జనవరి 12న ఉదయం 4 గంటలకు స్పెష‌ల్‌ బెనిఫిట్ షోకు అనుమతించింది. ఈ షోకి టికెట్ రేటును రూ.500 (జీఎస్‌టీతో క‌లిపి) గా నిర్ణ‌యించింది. మొద‌టి రోజు నుంచి జ‌న‌వ‌రి 25 వ‌ర‌కు రోజుకు ఐదు షోల‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ షోల‌కు మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 పెంపున‌కు అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రిగింది. కాగా, ఇవాళ‌ అమెరికా నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చిత్ర యూనిట్‌ డల్లాస్‌లో ఘనంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించ‌నుంది. దీనికోసం ఇప్ప‌టికే హీరో బాల‌య్య‌తో పాటు చిత్ర బృందం అక్క‌డికి చేరుకున్నారు. ఈ ఈవెంట్‌లోనే సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నార‌ని తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :