Thursday, 12 March 2026 04:28:37 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

'పుష్ప‌-2'పై ట్వీట్‌.. న‌టి సంయుక్తపై నెటిజ‌న్ల‌ ట్రోలింగ్‌..!

'పుష్ప‌-2'పై త‌మిళ న‌టి సంయుక్త ష‌న్‌ముఘ‌నాథ‌న్ ట్వీట్‌లో చిన్న మిస్టేక్‌ సినిమా చూస్తున్న స‌మ‌యంలో ప‌క్క‌న కుర్చున్న మ‌హిళ పూన‌కంతో ఊగిపోయిన వైనం దాం

Date : 17 December 2024 02:51 PM Views : 330

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో వ‌చ్చిన 'పుష్ప‌-2: ది రూల్' బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా ఊచ‌కోత కోస్తోంది. ఇప్ప‌టికే ప‌లు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇక‌ మూవీ చూసిన ప‌లువురు ప్ర‌ముఖులు సైతం పుష్ప‌ను మెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా త‌మిళ న‌టి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంయుక్త ష‌న్‌ముఘ‌నాథ‌న్ పుష్ప‌-2 సినిమా చూశారు. ఈ సంద‌ర్భంగా థియేట‌ర్‌లో ఆమెకు ఎదురైన ఓ ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ ట్వీట్ చేశారు. అయితే, అందులో ఆమె చేసిన చిన్న మిస్టేక్ ట్రోలింగ్‌కు కార‌ణ‌మైంది. "ఫోనిక్స్ మాల్‌లో 'పుష్ప‌-2' చూశాను. అయితే, జాత‌ర సీన్‌లో హీరో చీర క‌ట్టుకుని డ్యాన్స్ చేయ‌డంతో నా ప‌క్క‌న కుర్చున్న ఓ మ‌హిళ పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోయింది. మ‌హిళ‌ను ఆమె భ‌ర్త కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న అవ్వ‌డం లేదు. దాంతో భ‌య‌మేసింది. వెంట‌నే రూ. 10 టికెట్‌లోకి వెళ్లి కుర్చున్నా" అని సంయుక్త రాసుకొచ్చింది. ఇప్పుడీ ట్వీట్ వైర‌ల్ కాగా, దీనిపై నెటిజ‌న్లు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. రూ. 10 టికెట్ ఎప్పుడో ర‌ద్దు అయింద‌ని, నీవు ఏ కాలంలో ఉన్నావ‌ని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్క‌డా ఆ ధ‌ర‌కు సినిమా టికెట్ విక్ర‌యించ‌డం లేద‌ని ట్రోల్ చేస్తున్నారు.

Also Read : రేపు టీడీపీలో చేరనున్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :