Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నితిన్ హీరోగా నటిస్తున్న మూవీ రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రను పోషించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్ర్కీన్లలో ఒక్కొ టికెట్ పై రూ.50, మల్టీప్లెక్స్‌లో ఒక్కొ టికెట్ పై రూ.75ను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Admin
Studio18 News