Thursday, 12 March 2026 04:30:38 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Anushka Shetty: ఆ క్రేజ్ అనుష్కకి మాత్రమే సొంతం .. కానీ ..!

Date : 15 September 2025 06:33 PM Views : 329

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అందాల నాయికగా అనుష్కకి పేరు వరుసగా పడుతున్న ఫ్లాపులు అయినా తగ్గని క్రేజ్ రీసెంటుగా నిరాశపరిచిన 'ఘాటి' నెక్స్ట్ ప్రాజెక్టుపై అభిమానుల ఆసక్తి అనుష్క తరువాత అంత అందమైన కథానాయికలు ఎవరైనా తెలుగు తెరపైకి వచ్చారా అంటే లేదనే చెప్పాలి. అనుష్క తరువాత అందమైన కథానాయికలు చాలామంది వచ్చారు. కాకపోతే వాళ్లెవరూ అనుష్క గ్లామర్ ను మరిచిపోయేలా చేయలేకపోయారు. అనుష్క కనుముక్కు తీరు .. ఆమె ఆకర్షణీయమైన రూపం అలాంటివి. అందువల్లనే 'అరుంధతి' .. 'రుద్రమదేవి' వంటి పాత్రలను డిజైన్ చేసుకున్న దర్శకులకు ఆమె తప్ప మరొకరు కనిపించలేదు. 'బాహుబలి' సినిమాతో అనుష్కకి వచ్చిన క్రేజ్ మరొకరికి వచ్చి ఉంటే, వాళ్లు చకచకా చాలా ప్రాజెక్టులు ఒప్పేసుకుంటూ వెళ్లేవారు. కానీ అనుష్క సినిమాల సంఖ్యను తగ్గించడం అక్కడి నుంచే కనిపిస్తుంది. ఆ తరువాత సినిమాకి .. సినిమాకి మధ్య ఆమె ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. అది కూడా నాయిక ప్రధానమైన కథలను ఎక్కువగా ఎంచుకుంటూ వెళ్లారు. అయితే ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. ఆర్ధికంగాను డీలా పడ్డాయి. సాధారణంగా ఒక నాయిక వెండితెరకి దూరమై కొంతకాలమైతే, ప్రేక్షకులు చాలా తొందరగా మరిచిపోతారు. ఇండస్ట్రీ దృష్టి కూడా కొత్త నాయికలపైనే ఉంటుంది. కానీ అనుష్క ఎంత గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆమె సినిమాల కోసం ఎదురు చూసే అభిమానులు ఉన్నారు. ఆమె సినిమాలకి మంచి మార్కెట్ కూడా ఉంది. ఇది అనుష్క విషయంలో మాత్రమే జరుగుతున్న విచిత్రం. రీసెంటుగా వచ్చిన 'ఘాటి' విషయంలోనూ ఇదే జరిగింది. అయితే కథాకథనాల పరంగా ఈ సినిమా నిరాశ పరిచింది. అయినా అనుష్క అభిమానులు ఆమె నుంచి మరో సినిమా రావాలనే కోరుకుంటూ ఉండటం విశేషం. కాకపోతే కథల విషయంలో .. తన పాత్ర విషయంలో ఆమె మరింత దృష్టిపెట్టాలనేది అభిమానుల మాటగా వినిస్తోంది. మరి అనుష్క ఈ సారి ఎంత గ్యాప్ తీసుకుంటుందో .. ఏ ప్రాజెక్టును లైన్లో పెడుతుందో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :