Monday, 08 December 2025 03:25:21 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Gouri Kishan: రిపోర్టర్‌పై గౌరీ కిషన్ ఆగ్రహం.. మద్దతుగా నిలిచిన కుష్బూ

Date : 07 November 2025 06:08 PM Views : 61

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళ నటి గౌరీ కిషన్‌కు ఎదురైన బాడీ షేమింగ్ రిపోర్టర్ తీరుపై తీవ్రంగా స్పందించిన గౌరీ జర్నలిజం విలువలు కోల్పోయిందంటూ కుష్బూ ఆగ్రహం మలయాళ నటి గౌరీ కిషన్‌కు ఓ ప్రెస్ మీట్‌లో ఎదురైన బాడీ షేమింగ్ అనుభవంపై సీనియర్ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు. నటి బరువు గురించి ప్రశ్నించిన జర్నలిస్టు తీరును తప్పుబడుతూ, ప్రస్తుత జర్నలిజం ప్రమాణాలు పడిపోయాయని విమర్శించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "జర్నలిజం తన విలువను కోల్పోయింది. ఈ సోకాల్డ్ జర్నలిస్టులు వృత్తిని పాతాళానికి తీసుకుపోతున్నారు. ఒక మహిళ ఎంత బరువు ఉందనేది వారి పని కాదు. దీని గురించి హీరోను అడగటం ఎంత సిగ్గుచేటు! ఇలాంటి ప్రశ్నకు దీటుగా నిలబడిన యువ నటి గౌరీ కిషన్‌కు నా ధన్యవాదాలు. గౌరవం అనేది ఏకపక్షం కాదు. మీరు గౌరవం ఆశిస్తే, ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి" అంటూ కుష్బూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందంటే? గౌరీ కిషన్, ఆదిత్య మాధవన్ జంటగా నటించిన సినిమా ప్రమోషన్లలో ఈ వివాదం చోటుచేసుకుంది. సినిమాలో ఒక పాటలో హీరో హీరోయిన్‌ను ఎత్తుకునే సన్నివేశం ఉంది. దీన్ని ప్రస్తావిస్తూ ఓ రిపోర్టర్, "హీరోయిన్‌ను ఎత్తుకున్నప్పుడు బరువుగా అనిపించారా?" అని హీరోను ప్రశ్నించారు. దీనికి హీరో తాను జిమ్ చేస్తానని, అందుకే బరువుగా అనిపించలేదని సమాధానమిచ్చారు. అయితే, మరుసటి రోజు జరిగిన ప్రెస్ మీట్‌లో అదే రిపోర్టర్ మళ్లీ గౌరీ బరువు ప్రస్తావన తీసుకురావడంతో ఆమె సహనం కోల్పోయారు. "నా బరువు తెలుసుకుని మీరేం చేస్తారు? ఇది బాడీ షేమింగ్, ఒక స్త్రీని వస్తువుగా చూపిస్తున్నారు. నా నటన గురించి ఒక్క ప్రశ్న అడగకుండా నా బరువు గురించే అడుగుతున్నారు. ఇదే ప్రశ్న పురుష నటులను అడిగే ధైర్యం మీకు ఉందా? ఇది జర్నలిజం కాదు, మీ వృత్తికే అవమానం" అంటూ గౌరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రిపోర్టర్లు ఆ ప్రశ్నను సరదాగా అడిగినట్లు చెప్పి విషయాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించారు. కానీ గౌరీ అందుకు అంగీకరించలేదు. "నాకు అది సరదాగా అనిపించలేదు. బాడీ షేమింగ్‌ను సాధారణీకరించడం ఆపండి. ఆ ప్రశ్న నా గురించే కాబట్టి నా అభిప్రాయం చెప్పే హక్కు నాకుంది" అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం గౌరీ కిషన్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతుండగా, జర్నలిస్టుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :