Saturday, 24 January 2026 07:33:52 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

'క్రిమినల్ జస్టీస్ 4' (హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

Date : 29 May 2025 04:19 PM Views : 291

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'క్రిమినల్ జస్టీస్' వెబ్ సిరీస్ ఇంతకుముందు మూడు సీజన్లు స్ట్రీమింగులోకి వచ్చాయి. ఈ మూడు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. నాలుగో సీజన్ ఈ రోజు నుంచే అందుబాటులోకి వచ్చింది. 'క్రిమినల్ జస్టీస్ ఏ ఫ్యామిలీ మేటర్' అనే పేరుతో, 7 భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగుకు వచ్చింది. జియో హాట్ స్టార్ లోకి అడుగుపెట్టిన సీజన్ 4 నుంచి ముందుగా 3 ఎపిసోడ్స్ ను వదిలారు. కథ: రాజ్ (మహ్మద్ జీషన్) ఓ కార్పోరేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. భార్య అంజూ (సృవీన్ చావ్లా) .. కూతురు 'ఇరా' (ఖుషీ భరద్వాజ్) .. ఇదే ఆయన ఫ్యామిలీ. టీనేజ్ లోకి అడుగుపెట్టిన 'ఇరా', ఒక రకమైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. అందువలన ఆమె కేర్ టేకర్ గా రోషిణి (ఆషా నేగి) ని నియమిస్తారు. రాజ్ హాస్పిటల్లో ఆమె నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. కొన్ని కారణాల వలన రాజ్ - అంజూ మధ్య దూరం పెరుగుతుంది. విడాకులు తీసుకుకోవాలనే ఆలోచనలో వాళ్లు ఉంటారు. ఈ నేపథ్యంలో రాజ్ - రోషిణి మధ్య శారీరక సంబంధం ఏర్పడుతుంది. ఒక రోజున 'ఇరా' బర్త్ డే ఫంక్షన్ కావడంతో, రోషిణి కూడా అక్కడికి వెళుతుంది. అయితే ఆ ఫంక్షన్ లో రోషిణికి అవమానం జరుగుతుంది. దాంతో ఆమె అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతుంది. ఆ మరుసటి రోజున రోషిణి ఫ్లాట్ కి పనిమనిషి కమల వెళుతుంది. అక్కడ రక్తం మడుగులో రోషిణి పడిఉండటం .. ఆమె పక్కనే రాజ్ కూర్చుని ఉండటం చూసి షాక్ అవుతుంది. పోలీసులు రాజ్ ను అరెస్ట్ చేసి తీసుకుని వెళతారు. ఈ కేసు పోలీస్ ఆఫీసర్ గౌరికి అప్పగించబడుతుంది. దాంతో అన్ని వైపుల నుంచి ఆమె ఈ కేసును పరిశోధిస్తూ ఉంటుంది. అయితే లాయర్ మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠి)ని అంజూ కలుసుకుంటుంది. ఈ హత్య రాజ్ చేసి ఉండడనే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. దాంతో ఆయన రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలేమిటి? రోహిణిని హత్య చేసింది ఎవరు? అనేది మిగతా కథ. విశ్లేషణ: సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన థ్రిల్లర్ కథలు మర్డర్ తోనే మొదలవుతూ ఉంటాయి. ఆ మర్డర్ చేసే అవసరం .. అవకాశం ఎవరెవరికి ఉన్నాయనే విషయాన్ని హైలైట్ చేస్తూ కథ మలుపులు తీసుకుంటూ ఉంటుంది. చివరికి తెరవెనకనున్న అసలు హంతకుడిని బయటకి తీసుకు రావడం జరుగుతూ ఉంటుంది. అదే రూట్లో ఈ కథ కూడా కొనసాగుతూ ఉంటుంది. సీజన్ 4 లో ఇప్పుడు వదిలింది 3 ఎపిసోడ్స్ మాత్రమే. అందువలన ఇన్వెస్టిగేషన్ ఆరంభంలోనే ఉంది. కథలో ఇంకా అనేక మలుపులు చోటుచేసుకోవలసి ఉంది. అసలైన హంతకుడిని పట్టుకోవడానికి కథానాయకుడు ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? అనే అంశాలు ఈ సీజన్ రేటింగును నిర్ణయించనున్నాయి. గతంలో మాదిరిగానే ఈ సిరీస్ తన మార్క్ ను కంటిన్యూ చేసిందని చెప్పుకోవాలి. పనితీరు: ఈ సిరీస్ కి క్రైమ్ కథలు ప్రాణం. ఎంచుకునే కథలు .. వాటిని నడిపించిన విధానం ఈ సిరీస్ కి ఇంతవరకూ విశేషమైన ఆదరణ లభిస్తూ వచ్చేలా చేశాయి. సీజన్ 4 కి సంబంధించిన విషయంలోను అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని ఉంటారనే అనిపిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. నిర్మాణ పరమైన విలువలకు వంకబెట్టవలసిన పనిలేదు. ఫోటోగ్రఫి .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకి తగినట్టుగా సాగాయి. ఈ సీజన్ ద్వారా ఎన్ని ఎపిసోడ్స్ ను అందిస్తారు? ఆ ఎపిసోడ్స్ కంటెంట్ ను ఎలా డిజైన్ చేశారు? అనేది పూర్తిగా స్ట్రీమింగ్ లోకి వచ్చిన తరువాత మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :