Thursday, 12 March 2026 12:46:14 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Mega Movies | సమ్మర్ 2026పై మెగా ముద్ర.. వరుసగా ఐదు సినిమాలతో మెగా ఫ్యామిలీ దూకుడు

Mega Movies | సంక్రాంతి 2026 సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ‘మన శంకర వ

Date : 06 February 2026 08:47 PM Views : 77

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Mega Movies | సంక్రాంతి 2026 సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు సినీ ప్రేక్షకుల దృష్టంతా సమ్మర్ సీజన్‌పై పడింది. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలన్నీ వరుసగా వేసవి విడుదలలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు గమనిస్తే సమ్మర్ 2026పై మెగా ఫ్యామిలీ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు మెగా కుటుంబం నుంచి విడుదలకు రెడీ అవ్వడం విశేషం. అందులో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి టాప్ హీరోల సినిమాలు కూడా ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సమ్మర్ సీజన్‌కు శ్రీకారం చుట్టేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తరువాత మెగా డాటర్ నిహారిక నిర్మాతగా ఉన్న ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఫాంటసీ–హారర్ కామెడీ జానర్‌లో రాబోతోంది. తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమయం మొదలవుతుంది. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి హైప్ ఉంది. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో ఈ చిత్రం సమ్మర్ హైలైట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’. దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా ఫాంటసీ డ్రామా భారీ గ్రాఫిక్స్‌తో జూలైలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విజువల్ వండర్‌గా నిలిచే అవకాశమున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ కూడా సమ్మర్ బరిలోకి దిగుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. వినోదాత్మక అంశాలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఇలా ఒకే సమ్మర్ సీజన్‌లో మెగా ఫ్యామిలీ నుంచి వరుసగా ఐదు సినిమాలు విడుదల కావడం టాలీవుడ్‌లో అరుదైన విషయంగా మారింది. బాక్సాఫీస్ వద్ద ఈ మెగా సినిమాలు ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో, ప్రేక్షకులు ఏ చిత్రానికి ఎక్కువ ఆదరణ చూపిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వేసవి నిజంగా “మెగా సమ్మర్”గా నిలిచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :