Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో సినీ నిర్మాత రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పెట్టి, అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై విశాఖ, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కావాలంటూ ఒంగోలు పోలీసులు వర్మకు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, వర్మ పోలీసు విచారణకు హాజరు కాలేదు. ఆయన కోసం ఒంగోలు పోలీసులు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో వర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో, బెయిల్ వస్తే స్వేచ్ఛగా బయటకు రావచ్చని భావిస్తున్న వర్మకు నిరాశ ఎదురయింది. ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పు వెలువడేంత వరకు వర్మ అజ్ఞాతంలోనే ఉండే అవకాశం ఉంది. వర్మ అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం యాక్టివ్ గా ఉంది. 23న కోయంబత్తూరులో షూటింగ్ లో పాల్గొన్నట్టు నటులతో దిగిన ఫొటోలను వర్మ షేర్ చేశారు.
Also Read : జగన్ కు అదానీ లంచం వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు
Admin
Studio18 News