Sunday, 08 March 2026 10:28:12 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Jr NTR: ఎన్టీఆర్ కు ఇష్టమైన బిర్యానీ ఇదేనట!

Date : 20 September 2024 11:36 AM Views : 241

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : హీరో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే .. బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడినే తినేస్తానంటూ ఎన్టీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు అని అందరూ అనుకుంటుంటారు. తాజాగా ఇప్పుడు దేవర ప్రమోషన్స్ లో ఉన్న ఎన్టీఆర్ .. తమిళనాడు ఫేమస్ బిర్యానీ గురించి మాట్లాడాడు. దేవర మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల మూవీ ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లి వచ్చిన ఎన్టీఆర్ ... మంగళవారం సాయంత్రం చెన్నైలో దిగాడు.. మీడియాతో చిట్ చాట్ లో అనేక విషయాలు మాట్లాడాడు. యాంకర్ వరుస ప్రశ్నలు వేస్తుండగా.. మీరు నా ప్లాన్ నాశనం చేస్తున్నారు, నేను వెళ్లేటప్పుడు దిండిగల్ తలప్పకట్టి బిర్యానీ ఒకటి పార్సిల్ తీసుకువెళదామని అనుకున్నాను. కానీ .. మీ వల్ల అది మిస్ అవుతుందేమో..దేవర రిలీజ్ అయిన తర్వాత ఇద్దరం వెళ్లి తిందాం అని ఎన్టీఆర్ యాంకర్ తో చెప్పాడు. దీంతో ఆ బిర్యానీ అంటే ఎన్టీఆర్‌కు బాగా ఇష్టం అనేది అర్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దమ్ బిర్యానీ ఎలానో .. తమిళనాడు చెన్నైలో తలప్పకట్టి బిర్యానీ అంటే అంత ఫేమస్.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :