Saturday, 24 January 2026 01:31:01 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Upasana: రామ్‌చరణ్‌-ఉపాసన దంపతుల సెలబ్రేషన్స్‌ ఎందుకో తెలుసా?

Date : 23 October 2025 06:24 PM Views : 277

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మరోసారి తండ్రికానున్న రామ్‌చరణ్‌ వీడియోను షేర్‌ చేసిన ఉపాసన దీపావళి రోజు జరిగిన వేడుక వైరల్‌గా మారిన క్యూట్‌ వీడియో రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఆనందానికి ఇప్పుడు అవధుల్లేవు. త్వరలో ఈ ఇద్దరూ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉపాసన తన సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "ఈ దీపావళి మా ఇంట్లో ఆనంద దీపావళి. మా సంతోషాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసింది. అందరి ఆశీస్సులు, ఆశీర్వచనాలు మాకు అందాయి" అంటూ ఈ సంతోషకరమైన వార్తను ఉపాసన అందరితో పంచుకుంటూ ఒక మెమరబుల్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్, ఉపాసన కుటుంబ సభ్యులతో పాటు నాగేంద్రబాబు, నిహారిక కొణిదెల, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలతో పాటు పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు చిరు కుటుంబ సభ్యులతో పాటు అగ్ర కథానాయకులు వెంకటేష్, నాగార్జున, నయనతార ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. ఈ వీడియోలో వీరు కూడా ఉపాసనను ఆశీర్వదిస్తూ కనిపించారు. దీపావళి రోజే ఈ వేడుక కూడా జరిగినట్లుగా వీడియో చూస్తే తెలుస్తుంది. 2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023లో కూతురు (క్లీంకార) పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :