Monday, 19 January 2026 07:02:56 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Rana Daggubati: భాగ్యశ్రీని పొగడ్తలతో ముంచెత్తిన రానా!

Date : 18 November 2025 07:31 PM Views : 236

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'కాంత' హీరోయిన్ భాగ్యశ్రీపై రానా ప్రశంసల వర్షం ఆమె అంకితభావం, నిజాయతీ అసాధారణమని కొనియాడిన రానా సినిమా కోసం భాగ్యశ్రీ ఆరు నెలల్లో తమిళం నేర్చుకుందని ప్రశంస తనను మెంటార్‌గా అభివర్ణిస్తూ భాగ్యశ్రీ పెట్టిన పోస్ట్‌పై స్పందన ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి తాను కీలక పాత్రలో నటించిన 'కాంత' సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల భాగ్యశ్రీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో రానాను నిజమైన స్నేహితుడని, తన మెంటార్ అని అభివర్ణించింది. ఈ పోస్ట్‌పై రానా స్పందిస్తూ భాగ్యశ్రీ అంకితభావాన్ని, వృత్తిపట్ల ఆమెకున్న నిజాయతీని కొనియాడాడు. ఈ విషయంపై రానా మాట్లాడుతూ "భాగ్యశ్రీ అలా చెప్పడం ఆమె మంచితనం. ఆమె చాలా సిన్సియర్. ఈ సినిమా కోసం బాంబే నుంచి వచ్చిన ఆమె, తమిళం నేర్చుకోవాలని మేము చెప్పగానే ఏకంగా ఆరు నెలల పాటు ఇక్కడే ఉండి భాష నేర్చుకుంది. ఈ రోజుల్లో ఇంతటి అంకితభావం చూడటం చాలా అరుదు. ఆమె నిజాయతీ అసాధారణం" అని పేర్కొన్నాడు. "ప్రారంభంలో మేము కొంచెం కంగారుపడ్డాం. దుల్కర్ సల్మాన్, సముద్రఖని వంటి గొప్ప నటులతో సరిపోయే కొత్త అమ్మాయి కావాలని అనుకున్నాం. కానీ ఆమె నటిస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే, టెస్ట్ షూట్ ప్రారంభమైన కొద్ది రోజులకే మా 'కుమారి' పాత్రకు సరైన నటి దొరికిందని మాకు అర్థమైంది" అని రానా వివరించాడు. 'కాంత' యూనిట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భాగ్యశ్రీ పెట్టిన పోస్ట్‌లో "మొదటి రోజు నుంచి నాకు మద్దతుగా నిలిచిన రానాకు ధన్యవాదాలు. మీరు నా ప్రయాణంలో ఒక మెంటార్. మీ మార్గదర్శకత్వం లేకపోతే నేను ఇది చేయగలిగేదాన్ని కాదు" అని పేర్కొంది. 1950ల నాటి మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా థ్రిల్లర్‌ను స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :