Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Triptii Dimri : యానిమల్ భామ త్రిప్తి దిమ్రి ఓ వివాదంలో ఇరుక్కుంది. గతంలో ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు యానిమల్ సినిమాతో వచ్చి ఒక్కసారిగా స్టార్ అయిపొయింది త్రిప్తి దిమ్రి. దీంతో సినిమా అవకాశాలు, యాడ్స్, ఈవెంట్లు క్యూలు కట్టాయి ఈ అమ్మడికి. అందరి హీరోయిన్స్ లాగే పలు ఈవెంట్స్ కు హాజరవుతూ డబ్బులు సంపాదించుకుంటుంది. అయితే ఇటీవల జైపూర్ లో జరిగిన మహిళా వ్యాపారవేత్తల ఈవెంట్ కి వస్తానని చెప్పి లాస్ట్ మినిట్ లో వెళ్ళలేదు. దీంతో ఆ వ్యాపారవేత్తల కమిటీ త్రిప్తి దిమ్రిని వివాదంలో నిలిపారు. త్రిప్తి దిమ్రి జైపూర్ కి చెందిన మహిళా వ్యాపారవేత్తల FICCI FLO అనే ఈవెంట్ కి హాజరు కావాల్సి ఉంది. డబ్బులు తీసుకొని మరీ దీనికి రాకపోవడంతో ఆ ఈవెంట్లో త్రిప్తి దిమ్రి ఫొటోతో వేసిన బ్యానర్ పై కొంతమంది మహిళలు బ్లాక్ పెయింట్ పూశారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ఈ ఘటనపై ఆ ఈవెంట్ నిర్వహించిన ఓ మహిళా వ్యాపారవేత్త మీడియాతో మాట్లాడుతూ.. త్రిప్తి దిమ్రి ఈవెంట్ కి హాజరు అవుతాను అని 5.5 లక్షలు తీసుకుంది. ఈవెంట్ మొదలయ్యే ముందు కూడా అయిదు నిమిషాల్లో వచ్చేస్తానని కాల్ ద్వారా తెలియచేసింది. కానీ ఈవెంట్ కి హాజరు కాలేదు. ఆమె బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది. రాను అని మాకు ముందే సమాచారం ఇవ్వలేదు. ఆమెపై మా టీమ్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. జైపూర్ లో ఆమె సినిమాలు బ్యాన్ చేస్తాం, ఆమె మా అందర్నీ మోసం చేసింది అంటూ ఫైర్ అయింది. దీంతో ఈ ఘటన వైరల్ గా మారింది. మరి దీనిపై త్రిప్తి దిమ్రి స్పందిస్తుందా చూడాలి.
Admin
Studio18 News