Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా పవన్ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సినిమాల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలో తమిళంలో ఫేవరేట్ కమెడియన్, డైరెక్టర్ గురించి పవన్‌కు ప్రశ్న ఎదురైంది. తమిళంలో తనకు యోగి బాబు అంటే ఇష్టం అని పవన్ చెప్పారు. ఆయన నటన చాలా బాగుంటుందన్నారు. ఇటీవల ఆయన నటించిన ఓ సినిమా చూశానని, బాగా నటించారన్నారు. బాగా నవ్వుకున్నట్లు చెప్పారు. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుతూ.. లోకేష్ కనగరాజ్ ఫిలిం మేకింగ్ నచ్చుతుందన్నారు. లియో, విక్రమ్ సినిమాలను చూశానని, అతడి ఫిలిం మేకింగ్ బాగుందన్నారు. పవన్ వ్యాఖ్యలపై యోగిబాబు స్పందించారు. పవన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. “ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. మీరు చెప్పిన మాటలు.. నన్ను ఎంతో ఉత్సాహపరిచాయి.” అని యోగిబాబు ట్వీట్ చేశారు. లోకేష్ కనగరాజ్ సైతం పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. “ఈ మాటలు వినడం నిజంగా గర్వంగా ఉంది. మీరు నా పనిని ఇష్టపడ్డారని తెలిసి ఎంతో సంతోషపడిపోయాను. మీకు పెద్ద కృతజ్ఞతలు సార్. “అని లోకేష్ అన్నారు.
Admin
Studio18 News