Monday, 19 January 2026 08:30:52 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

Varanasi | టాలీవుడ్‌లో రాజమౌళితో సినిమా చేయాలని కోరుకోని హీరో ఉండరు. ఆయన సినిమాలు అంటే గ్లోబల్ రేంజ్, అంతర్జాతీయ గుర్తింపు గ్యారంటీ. అయితే ఆ క్రేజ్ వె

Date : 09 December 2025 07:51 PM Views : 171

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Varanasi | టాలీవుడ్‌లో రాజమౌళితో సినిమా చేయాలని కోరుకోని హీరో ఉండరు. ఆయన సినిమాలు అంటే గ్లోబల్ రేంజ్, అంతర్జాతీయ గుర్తింపు గ్యారంటీ. అయితే ఆ క్రేజ్ వెనుక ఉన్న కఠినమైన కృషి గురించి ఇండస్ట్రీకి బాగా తెలుసు. పర్ఫెక్షన్‌ కోసం నటీనటులను పిండేయడమే జక్కన్న స్టైల్. ఇదే విషయాన్ని గతంలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సరదాగా పలుమార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే దశలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు అడుగుపెడుతున్నారు. రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది మహేష్ కెరీర్‌లోనే కాకుండా రాజమౌళి ఫిల్మోగ్రఫీలో కూడా మరో భారీ ప్రాజెక్ట్‌గా తయారవుతోంది. ఇప్పటికే బయటికొచ్చిన సమాచారం ప్రకారం, మహేష్ బాబు ఈ సినిమాలో ఏకంగా 5 విభిన్న అవతారాల్లో కనిపించబోతున్నారట. అందులో రాముడు, రుద్రుడు కీలక పాత్రలుగా ఉండగా, మిగిలిన మూడు పాత్రలు కూడా కథకు ముఖ్యమైన వేరియేషన్స్ అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇన్నేళ్ల కెరీర్‌లో మహేష్ బాబు ద్విపాత్రాభినయం కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఐదు పాత్రలు అంటే ఇది చిన్న విషయం కాదు. ప్రతి పాత్రకు భిన్నమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. వాయిస్ మాడ్యులేషన్, మైండ్‌సెట్, ఎమోషనల్ రేంజ్ ఇవి అన్నింటినీ పర్ఫెక్ట్‌గా చేయాల్సి వస్తోంది. రాజమౌళి ఒకే సీన్‌ కోసం వంద టేకులు తీస్తారనే విషయాన్ని ఇండస్ట్రీ బాగా తెలుసు. ఇప్పుడు ఐదు పాత్రలు ఉంటే మహేష్ బాబు పడాల్సిన కష్టం ఎలా ఉంటుందో అని మ‌హేష్ ఫ్యాన్స్ ముచ్చ‌టించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ గెటప్స్ కోసం మహేష్ శారీరకంగా కూడా పలు మార్పులు చేసుకుంటున్నారు. రుద్ర లుక్ కోసం జుట్టు పెంచడం, మసిల్స్ పెంచి కొత్త లుక్‌లో కన్పించడం, రాముడి పాత్ర కోసం స్లిమ్ లుక్‌లోకి మార‌డం, ఇంకా మిగిలిన పాత్రల కోసం ఎంత కష్టం పడాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. సుమారు ₹1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా దృష్టి పడింది. అందుకే రాజమౌళి ఒక్క విషయంలో కూడా రాజీ పడడం లేదు. మహేష్ బాబు కూడా దర్శకుడు చెప్పిన ఒక్క సూచనను కూడా మిస్ కాకుండా అమలు చేస్తున్నారట. మహేష్ బాబు చేస్తున్న ఈ ఐదు గెటప్స్ కథలో ఏ విధంగా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తాయి?ఈ పాత్రల వెనుక రాజమౌళి ఏ మ్యాజిక్ దాచిపెట్టాడు? అన్నది తెలుసుకోవాలంటే మాత్రం ప్రేక్షకులంతా కొంతకాలం ఆగాల్సిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :