Sunday, 08 February 2026 10:02:37 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Bhadrakali | ఆస‌క్తి రేపుతున్న భ‌ద్ర‌కాళి ట్రైల‌ర్.. ఆక‌ట్టుకుంటున్న సంభాష‌ణ‌లు

Bhadrakali | తెలుగు ప్రేక్షకులను బిచ్చ‌గాడు సినిమాతో అల‌రించిన విజ‌య్ ఆంటోని చివ‌రిగా మార్గన్ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ మూవీ విజ‌యం తర్వాత విజయ్ ఆంటో

Date : 10 September 2025 08:11 PM Views : 415

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Bhadrakali | తెలుగు ప్రేక్షకులను బిచ్చ‌గాడు సినిమాతో అల‌రించిన విజ‌య్ ఆంటోని చివ‌రిగా మార్గన్ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ మూవీ విజ‌యం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో ‘భద్రకాళి’ వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ఈ సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి.తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. రాజ‌కీయ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు అర్జున్ తెర‌కెక్కిస్తుండ‌గా, త‌ర‌త‌రాల పౌరుషం..తెగింపున‌కి వెన‌కాడ‌దు అంటూ ఎన్నికలు, డ‌బ్బు చుట్టూ ప‌లు సంభాష‌ణ‌లు ఆస‌క్తిరేపుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ ఆస‌క్తి రేపుతుంది. ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. షెల్లీ కాలిస్ట్ డీవోపీ, విజయ్ ఆంటోనీ స్వయంగా మ్యూజిక్ అందిస్తున్నారు. రేమండ్ డెరిక్ ఎడిటర్. రాజశేఖర్ ఫైట్ మాస్టర్. శ్రీరమన్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగులో డైలాగ్స్‌ని రాజశేఖర్ రెడ్డి రాశారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :