Saturday, 24 January 2026 09:11:54 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Bharani Shankar: నా వలన మా అమ్మ చాలా బాధపడింది: నటుడు భరణి శంకర్

Date : 08 September 2025 07:11 PM Views : 943

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : 'చి.ల. సౌ. స్రవంతి' పేరు తెచ్చింది మంచి పేరు .. డబ్బు వచ్చాయి నేను నష్టపోవడానికి కారణాలివే అమ్మను సంతోషపెట్టాలని ఉందన్న భరణి శంకర్ బుల్లితెర ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో భరణి శంకర్ ఒకరు. ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేస్తూ వెళ్లిన భరణి శంకర్, ఆ తరువాత వెండితెరపై కూడా కనిపించారు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను పంచుకున్నారు." ఒక ఫ్రెష్ ఫేస్ కోసం బుల్లితెరవాళ్లు వెదుకుతున్న సమయంలో నేను రావడం నాకు కలిసొచ్చింది. 'చి.ల. సౌ. స్రవంతి' సీరియల్ ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది" అని అన్నారు. " వరుస అవకాశాలు .. పేరు .. డబ్బు వచ్చాయి. ఆ సమయంలో కొన్ని వ్యసనాల కారణంగా వచ్చిన డబ్బును వచ్చినట్టుగా ఖర్చు చేశాను. ఎవరైనా చెడిపోతే అందుకు కారణం స్నేహతులేనని చెబుతూ ఉంటారు. నేను అలా ఎవరినీ బాధ్యులను చేయను. కిందపడినా .. పైకి లేచినా .. అందుకు ఎవరికి వారే కారణమని చెబుతాను. నా ఆలోచనా విధానం సరిగ్గా లేకపోవడం వల్లనే నేను నష్టపోయాను. నిర్మాతగానూ చేసి దెబ్బతిన్నాను" అని చెప్పారు. " ఎవరైనా సరే తెలిసిన పని చేయాలి. తెలియని ప్లేస్ కి వెళ్లి యుద్ధం చేయకూడదు. నటుడిగా ఎదగాలనే ప్రయత్నం చేయకుండా, నిర్మాణం వైపు వెళ్లడమే నేను చేసిన తప్పు. అందువలన అయిన అప్పులు తీర్చడానికి మా అమ్మ తన బంగారం కూడా తాకట్టు పెట్టింది. నా కారణంగా అమ్మ చాలా బాధ పడింది. ఇప్పుడు నేను మారిపోయాను .. నేను ఏమిటనేది తెలుసుకున్నాను. మా అమ్మను సంతోష పెట్టాలనే ఆలోచన తప్ప నాకు మరో ధ్యాసలేదు" అని అన్నారు. కాగా, భరణి నిన్న ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్-9లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటరైన సంగతి తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :