Saturday, 07 March 2026 09:07:00 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Sunny Deol: బాలీవుడ్ నిర్మాతలు తెలుగు చిత్ర పరిశ్రమను చూసి నేర్చుకోవాలి: సన్నీ డియోల్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సన్నీ డియోల్ ఏప్రిల్ 10న వస్తున్న 'జాట్' ప్రమోషన్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సన్నీ డియోల్

Date : 25 March 2025 03:30 PM Views : 426

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ టాలీవుడ్‌లో స్థిరపడాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటీనటులను గౌరవించే విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. సన్నీ డియోల్... టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'జాట్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్ ఈవెంట్ లో సన్నీడియోల్ మాట్లాడుతూ, టాలీవుడ్ నిర్మాతల నుంచి బాలీవుడ్ నిర్మాతలు ఎన్నో విషయాలు నేర్చుకోవాలని సూచించారు. దక్షిణాదిలో నటీనటులను గౌరవించే విధానం, సినిమా నిర్మాణంలో వారికున్న స్పష్టత బాలీవుడ్‌కు ఆదర్శనీయమని ఆయన అభిప్రాయపడ్డారు. టాలీవుడ్‌తో కలిసి పనిచేయడం తనకు ఎంతో నచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉందని సన్నీడియోల్ అన్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో దర్శకులు చెప్పినట్లు నిర్మాతలు చేసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, కమర్షియల్ అంశాలకే ప్రాధాన్యతనిస్తుండటంతో ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి కోల్పోయారని ఆయన విశ్లేషించారు. సన్నీడియోల్ నటిస్తున్న 'జాట్' చిత్రంలో సయామీ ఖేర్, రెజీనా కథానాయికలుగా నటిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :