Sunday, 15 March 2026 09:50:49 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

సాయిపల్లవి చేసిందీ అంటే అది హిట్టేనట!

'అమరన్'తో హిట్ కొట్టిన సాయిపల్లవి ఆమె నటనకి ప్రశంసల వెల్లువ తమిళనాట రికార్డుస్థాయి వసూళ్లు తెలుగులో చైతూ జోడిగా చేసిన 'తండేల్' ఫిబ్రవరి 7వ తేదీన విడు

Date : 11 November 2024 11:24 AM Views : 316

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సాయిపల్లవి .. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ పేరుకు ఎంతో క్రేజ్ ఉంది. జీవితానికి దగ్గరగా అనిపించే కథలను ఆమె ఇష్టపడుతుంది. నటన ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటుంది. ఇక డాన్స్ విషయంలో ఆమెకి వంక బెట్టవలసిన పనిలేదు. సాయిపల్లవి అందుకునే పారితోషికం తక్కువేమీ కాదు. కానీ కథ - తన పాత్ర నచ్చితేనే తప్ప ఆమె చేసే రకం కాదు. అందువల్లనే ఆమె కెరియర్లో ఎక్కువగా హిట్స్ కనిపిస్తాయి. అలాంటి సాయిపల్లవి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'అమరన్' వచ్చింది. శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, మేజర్ 'ముకుంద్ వరదరాజన్' జీవితచరిత్రగా రూపొందింది. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా, ఈ ఏడాది భారీ వసూళ్లను సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. హీరో చుట్టూ కథ తిరిగినప్పటికీ, సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఎప్పటిలానే ఆమెకి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకి కమల్ ఒక నిర్మాత కావడం మరో విశేషం. 'అమరన్' సాధించిన సక్సెస్ ను ఆమె ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటోంది. ఆమె ఒక సినిమా చేసిందీ అంటే అది హిట్టేనని తెలుగు .. తమిళ అభిమానులు చెప్పుకుంటున్నారు. తెలుగులో చైతూ జోడీగా రీసెంటుగా ఆమె చేసిన సినిమానే 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లకు రానుంది. శ్రీకాకుళానికి చెందిన ఒక జాలరి కథ ఇది. ప్రేమకథ - దేశభక్తి ప్రధానంగా కనిపించే ఈ సినిమా కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు

Also Read : మోదీ ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. సిద్దరామయ్య సవాల్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :