Thursday, 12 March 2026 12:39:14 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Arjun Sarja: మోసపోయింది ఎక్కువ .. కూడబెట్టింది తక్కువ: సీనియర్ హీరో అర్జున్

Date : 07 February 2026 06:45 PM Views : 116

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : దర్శకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ హీరోయిన్ గా ఆయన కూతురు ఎంట్రీ ఈ నెల 14న విడుదలవుతున్న 'సీతా పయనం' శోభన్ బాబుగారి మాట వినలేదన్న అర్జున్ అర్జున్ కి యాక్షన్ కింగ్ గా అటు కోలీవుడ్ లోను .. ఇటు టాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఉంది. ఆరంభంలో అర్జున్ చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో ఆయన హీరోగా నిలబడ్డారు. ఆ తరువాత అలాంటి విజయాలు అనేకం ఆయన ఖాతాలోకి చేరిపోయాయి. అలాంటి అర్జున్ సుదీర్ఘమైన కెరియర్ తరువాత, తన కూతురు ఐశ్వర్య కథానాయికగా 'సీతా పయనం' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అర్జున్ 'గ్రేట్ ఆంధ్ర'కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "తెలుగులో నేను చేసిన మొదటి సినిమాకిగాను పారితోషికంగా అందుకున్నది పాతికవేలు. నేను ప్లాన్ చేసుకోలేదు గానీ నా కెరియర్ గ్రాఫ్ చాలా బాగా వెళ్లింది. చాలా చిన్న వయసులోనే ఎక్కువ డబ్బు వచ్చేసింది. అప్పట్లో ఆ డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా నాకు తెలియలేదు" అని అన్నారు. "ఎవరూ .. ఏమిటనేది నేను చెప్పను గానీ, నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు. అందువలన నేను చాలా నష్టపోయాను. ఆ ప్రాపర్టీస్ ఈ రోజున ఉంటే నేను మరో రేంజ్ లో ఉండేవాడిని. శోభన్ బాబు గారు నాకు చాలా క్లోజ్. నాతో ఉన్నంత చనువుగా ఆయన ఎవరితోనూ ఉండేవారు కాదు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు కూడా. ఆయన ఎన్నో సలహాలు ఇచ్చేవారు. కానీ అప్పుడు నాకు అవి ఎక్కలేదు" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :