Saturday, 24 January 2026 08:45:11 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

32 ఏళ్ల తర్వాత బాలకృష్ణ సినిమాలో విజయశాంతి?

Date : 22 May 2025 11:41 AM Views : 320

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఒకప్పటి హిట్ పెయిర్ బాలకృష్ణ, విజయశాంతి మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని, అది కూడా బాలకృష్ణ ప్రతిష్టాత్మక చిత్రం 'అఖండ-2'లో అని గట్టిగా వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే అని చెప్పాలి. గతంలో బాలకృష్ణ, విజయశాంతి జోడీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. 'కథానాయకుడు' సినిమాతో మొదలైన వీరి ప్రయాణం, 'ముద్దుల క్రిష్ణయ్య', 'ముద్దుల మావయ్య' వంటి గోల్డెన్ జూబ్లీ చిత్రాలతో పాటు 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్స్‌పెక్టర్' వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల వరకు సాగింది. వీరిద్దరూ కలిసి దాదాపు 16 సినిమాల్లో నటించి, తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చివరిసారిగా 1993లో వచ్చిన 'నిప్పురవ్వ' చిత్రంలో ఈ జంట కనిపించింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాకు సీక్వెల్‌గా 'అఖండ-2' తెరకెక్కుతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో విజయశాంతి ఓ కీలక పాత్ర పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమై, వీరిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే, సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :