Saturday, 07 March 2026 09:20:59 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Sapthagiri: హీరో కావడమనేది నేను చేసిన పొరపాటు కాదు: సప్తగిరి

కమెడియన్ గా సప్తగిరికి మంచి పేరు హీరోగా తగ్గిన అవకాశాలు ఈ నెల 21న రానున్న 'పెళ్లికాని ప్రసాద్' హిట్ కొట్టడం ఖాయమంటున్న సప్తగిరి

Date : 13 March 2025 04:39 PM Views : 424

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తెలుగు తెరపై సందడి చేస్తున్న కమెడియన్స్ లో సప్తగిరి ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన సప్తగిరి, ఆ తరువాత కమెడియన్ గా తెరపైకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. అలాగే కమెడియన్ నుంచి హీరోగా మారడానికి కూడా ఆయనకి ఎక్కువ సమయం పట్టలేదు. అలాంటి సప్తగిరి కొంత గ్యాప్ తరువాత హీరోగా చేసిన సినిమా 'పెళ్లికాని ప్రసాద్'. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో 'సప్తగిరి' బిజీగా ఉన్నాడు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. " కమెడియన్స్ చాలామంది కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్న సమయంలో హీరోలుగా మారుతున్నారు .. ఆ తరువాత తిరిగి కామెడీ వైపు వస్తున్నారు. అలా చేయడంలో తప్పులేదనేది నా ఉద్దేశం. వేరియేషన్స్ చూపించే పాత్రలు పడినప్పుడు కొన్ని ప్రయోగాలు చేయకతప్పదు. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉంటేనే ఆడియన్స్ కి బోర్ అనిపించకుండా ఉంటుంది" అని అన్నాడు. " హీరోగా మారిన తరువాత కమెడియన్ గా వచ్చే అవకాశాలను .. డబ్బును కోల్పోయాననే టాక్ బయట ఉంది. అందువల్లనే గ్యాప్ వచ్చిందని కూడా చెప్పుకుంటారు. కానీ ఆ మాటను నేను ఒప్పుకోను. ఎందుకంటే నన్ను నేను రీఛార్జ్ చేసుకోవడానికి తగిన సమయం దొరికిందని అనుకుంటాను. అలా రీఛార్జ్ అయిన తరువాత చేసిన సినిమా ఇది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :