Saturday, 17 January 2026 10:34:20 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Upendra: హ్యాకర్ల వలలో స్టార్ హీరో ఉపేంద్ర.. డెలివరీ పేరుతో ఫోన్లు హ్యాక్!

Date : 15 September 2025 07:09 PM Views : 231

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర దంపతుల మొబైల్ ఫోన్లు హ్యాక్ కొన్ని కోడ్‌లు ఎంటర్ చేయమనడంతో హ్యాకింగ్‌కు గురైన ఫోన్లు తమ ఫోన్ల నుంచి డబ్బులడిగితే ఇవ్వొద్దని అభిమానులకు విజ్ఞప్తి ప్రముఖ కన్నడ నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. డెలివరీ పేరుతో ఫోన్ చేసిన కేటుగాళ్లు, వారిద్దరి మొబైల్ ఫోన్లను హ్యాక్ చేశారు. ఈ షాకింగ్ విషయాన్ని స్వయంగా ఉపేంద్రే సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, తమ అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు. వివరాల్లోకి వెళితే, ఉపేంద్ర భార్య ప్రియాంకకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆర్డర్ చేసిన వస్తువు డెలివరీ కోసం కాల్ చేస్తున్నట్లు నమ్మబలికాడు. డెలివరీ ప్రక్రియ పూర్తి కావాలంటే కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు, నంబర్లను ఫోన్‌లో ఎంటర్ చేయాలని సూచించాడు. అది నిజమని నమ్మిన ఆమె, అవతలి వ్యక్తి చెప్పినట్లే చేయడంతో ఫోన్ హ్యాకింగ్‌కు గురైందని ఉపేంద్ర తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని ఆయన వివరించారు. ఈ ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. “నా భార్య ఫోన్, ఆ తర్వాత నా ఫోన్ హ్యాక్ అయ్యాయి. మా ఫోన్ నంబర్ల నుంచి గానీ, సోషల్ మీడియా ఖాతాల నుంచి గానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే దయచేసి స్పందించవద్దు. అలాంటి మెసేజ్‌లు లేదా కాల్స్ వస్తే ఏమాత్రం డబ్బు పంపొద్దు” అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో, సామాన్య ప్రజలు ఆన్‌లైన్ మోసాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :