Thursday, 12 March 2026 03:32:42 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Sobhita Dhulipala : పెళ్లి, మాతృత్వంపై శోభిత ధూళిపాళ వ్యాఖ్యలు.. చైతుతో నిచ్చితార్ధం అయ్యాక మొదటి ఇంటర్వ్యూ..

Date : 26 September 2024 11:34 AM Views : 278

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Sobhita Dhulipala : హీరోయిన్ శోభిత ధూళిపాళ – నాగ చైతన్య ఇటీవల ఆగస్టు 9న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక చైతుతో నిశ్చితార్థం అయ్యాక శోభిత మరింత పాపులర్ అయింది. శోభిత ఏం మాట్లాడినా, ఏ ఫోటో పెట్టినా వైరల్ అవుతుంది. శోభిత లవ్ సితార అనే ఓటీటీ సినిమాతో రేపు సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ తన నిశ్చితార్థం, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చైతుతో నిశ్చితార్థం తర్వాత ఇదే తన మొదటి ఇంటర్వ్యూ కావడం గమనార్హం. ఈ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ మాట్లాడుతూ.. నా నిశ్చితార్థం, పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలని నేను కలలు కనలేదు. వాటి కోసం ప్లాన్స్ వేసుకోలేదు. సాంప్రదాయంగా సింపుల్ గా జరిగితే చాలు అనుకున్నాను. అనుకున్నట్టే సింపుల్ గా ఫ్యామిలీ మధ్యలో జరిగింది. నా వరకు అది పర్ఫెక్ట్. నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లలని కనాలి అనుకునేదాన్ని. మాతృత్వంలోని అనుభూతిని నేను పొందాలి అనుకుంటాను. అలాగే నా పేరెంట్స్, సంసృతి, సంప్రదాయాలను గౌరవిస్తాను. అందుకే నేను ఎంత ఎదిగిన నాకు సంబంధించినవి సాంప్రదాయంగా మా పేరెంట్స్ సమక్షంలో జరగాలి అనుకుంటాను అని తెలిపింది. దీంతో పెళ్లి కూడా సింపుల్ గా ఫ్యామిలీ, సన్నిహితుల మధ్య సాంప్రదాయంబద్దంగా జరుగుతుందని తెలుస్తుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :