Monday, 19 January 2026 07:14:52 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Ramakrishna fighter: ఏం చెప్పమంటారు .. ఒళ్లంతా గాయాలే: ఫైటర్ రామకృష్ణ

Date : 12 November 2025 06:58 PM Views : 114

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఫైటర్ గా 36 ఏళ్ల అనుభవం వేయి సినిమాలకి పైగా చేసిన రామకృష్ణ అప్పట్లో రోజుకి 130 రూపాయలు ఇచ్చేవారని వెల్లడి నెలలో కొన్ని రోజులే పని ఉంటుందని వివరణ క్షేమంగా ఇంటికి తిరిగొస్తామనే నమ్మకం లేదని వ్యాఖ్య సినిమాలలో పోరాట సన్నివేశాలు ఎక్కువ థ్రిల్ కి గురిచేస్తూ ఉంటాయి. అయితే ఆ సన్నివేశాలలో హీరోలను గురించి తప్ప ఫైటర్స్ గురించి ఎవరూ పట్టించుకోరు. అలాంటి ఫైటర్ గా వేయి సినిమాల వరకూ పనిచేసినవారే రామకృష్ణ. తాజాగా 'సుమన్' టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. "నేను ప్రకాశం జిల్లాలోని 'నందిగుంట పాలెం'లో పుట్టి పెరిగాను. నేను చదువుకున్నది నాల్గొవ తరగతి వరకే. సినిమా ఫీల్డ్ కి వస్తాననిగానీ .. ఈ స్థాయికి చేరుకుంటానని గాని నేను 'కల'లో కూడా అనుకోలేదు. 36 ఏళ్ల కెరియర్ లో సీనియర్ హీరోల నుంచి ఇప్పటి హీరోల వరకూ కలిసి పనిచేశాను. బాలీవుడ్ లో సల్మాన్ .. షారుక్ .. ఆమీర్ ఖాన్ వాళ్ల సినిమాలలోను ఫైటర్ గా చేశాను. వాళ్లంతా చాలా అభిమానించేవారు" అని అన్నారు. "అప్పట్లో ఫైట్స్ లో 'రోప్' .. 'బెడ్స్ ' ఉపయోగించడం ఉండేది కాదు. రియల్ గా చేయవలసిందే. అందువలన గాయాలు అవుతూ ఉండేవి. నా ఒళ్లంతా గాయాలే ఉన్నాయి. బాడీ అంతా డ్యామేజ్ అయింది. షూటింగుకి వెళితే, క్షేమంగా తిరిగి వస్తామనే గ్యారెంటీ లేదు. తట్టుకోలేక వెనక్కి వెళ్లిపోయి చిన్న చిన్న షాపులు పెట్టుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. అప్పట్లో ఒక రోజుకి 130 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 4 వేల వరకూ ఇస్తున్నారు. అయితే ఆ డబ్బులు రావడానికి రెండు .. మూడు నెలలు పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఫైటర్ గా రావడం వేస్ట్ అనే చెబుతాను" అని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :