Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నటుడిగా తనది 36 ఏళ్ల ప్రయాణమని బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తెలిపారు. 23 ఏళ్లకే తాను నటుడిని అయ్యాయని... 27 ఏళ్లకు సినిమా హీరో అయ్యానని చెప్పారు. భగవంతుడు తనకు అద్భుతమైన జీవితాన్ని, కోట్లాది మంది అభిమానులను, కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదనని ఇచ్చారని తెలిపారు. తనకు ఒక కోరిక మిగిలి ఉందని... లొకేషన్ లో నటిస్తూనే తాను చనిపోవాలనేది తన చివరి కోరిక అని షారుక్ అన్నారు. దర్శకుడు యాక్షన్ చెప్పగానే తాను చనిపోవాలని, కట్ చెప్పిన తర్వాత కూడా లేవకూడదని చెప్పారు.
Admin
Studio18 News