Monday, 08 December 2025 04:07:37 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

మోక్షజ్ఞ జోడిగా రాషా తడాని .. ఆమె గురించి సెర్చ్ చేస్తున్న ఫ్యాన్స్!

హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞ ఆయన జోడీగా రవీనా టాండన్ కూతురు సినిమాల్లోకి రాకముందే క్రేజ్ తెచ్చుకున్న రాషా తడాని వచ్చే నెలలో సెట్స్ ప

Date : 18 November 2024 12:43 PM Views : 234

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నందమూరి వారసుడిగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో కాస్త ఆలస్యమవుతూనే వచ్చింది. మోక్షజ్ఞకి హీరోగా చేయాలనే ఇంట్రెస్ట్ లేదేమోనని కూడా అనుకున్నారు. కానీ ఆయన నటన .. డాన్సులు .. ఫైట్లు .. గుర్రపు స్వారీ వగైరా నేర్చేసుకుని రంగంలోకి దిగిపోయాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో .. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధమైపోయింది. మోక్షజ్ఞ ఫస్టు లుక్ పోస్టర్ కూడా బయటికి వచ్చేసింది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో విక్రమ్ తనయుడు ధృవ్ కనిపించనున్నాడనీ, హీరోయిన్ గా రవీనా టాండన్ కూతురు రాషా తడాని టాలీవుడ్ కి పరిచయం కానున్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఇక్కడి ఫ్యాన్స్ ఈ బ్యూటీ గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. గతంలో రవీనా టాండన్ తెలుగులోను రెండు .. మూడు సినిమాలు చేసింది. బాలయ్య బాబుతో ఆమె చేసిన 'బంగారు బుల్లోడు' అప్పట్లో పెద్ద హిట్టు. ఇప్పుడు ఆమె కూతురు బాలయ్య తనయుడి జోడీ కడుతుండటం విశేషం. రాషా తడానికి మార్షల్ ఆర్ట్స్ మంచి ప్రవేశం ఉంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫర్ గా పేరుంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువే. మంచి ఫిట్ నెస్ తో .. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వెళుతున్న ఈ సినిమాను, వేసవి సెలవుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

Also Read : మణిపూర్ లో మళ్లీ మంటలు.. జిరిబామ్ లో దమనకాండే కారణమా?

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :