Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్…రీల్‌లో కంటే రియల్‌గా ఫేమ్ అయిన టాలీవుడ్ యాక్టర్. ఒకటా, రెండా ఎన్ని వివాదాలు, ఎన్ని వీడియోలు. ఒక్కొక్క వీడియో బ్లాస్ట్‌లా పేలేది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీపై ఆయన అన్న మాటలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
ఈవీడియో చూశాక, గాంధీజీని అమితంగా ఆరాధించే 143కోట్ల మంది భారతీయుల రక్తం మరగదా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఇంత నీచంగా మాట్లాడతాడా అన్న కోపం నెటిజన్లలో కట్టలు తెంచుకుంది. శ్రీకాంత్‌పై ఉప్పెనలా విరుచుకుపడింది. అతను పోస్ట్ చేసిన వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. జబ్బల బనియను, మత్తులో కళ్లు, చేతిలో సిగరెట్టు… వెకిలిగా నవ్వడం, చులకన చేసి మాట్లాడటం… తప్ప తాగి చేశాడని క్లియర్‌గా అర్థం అవుతుంది. ఇలాంటి వీడియోను ఎవరైనా సహిస్తారా, భరిస్తారా. మత్తెక్కి తూలితే ఓకే, మత్తెక్కి వాగితే ఎవరైనా ఊరుకుంటారా…ఊరగాయపెట్టి ఊరేగించరా..ఇప్పుడదే జరిగింది శ్రీకాంత్ విషయంలో. తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. కొందరైతే ఆగ్రహంతో శ్రీకాంత్ డౌన్ డౌన్ అంటూ ఆయన పోస్టర్లను చించివేసి నిరసన తెలుపుతున్నారు. శివుడు నోరిచ్చాడు కదా అని ఇష్టారీతిన మాట్లాడొచ్చా అంటూ శ్రీకాంత్‌పై తిట్ల దండకంతో దండయాత్ర చేస్తోంది సోషల్ మీడియా. ఆయనపై యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్, సేవాలాల్ బంజారా సంఘం శ్రీకాంత్ అయ్యంగార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీపై అవమానకర వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని, శ్రీకాంత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ భరత్‌పై ఇలాంటి పనులతో వివాదాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఏపీలో జగన్ హయాంలో ఉన్నప్పుడు విజయవాడకి వెళ్లిన ఆయన బూమ్ బూమ్ బీర్లపై వ్యగ్యంగా వీడియో చేసి వదిలాడు. దీంతో వైసీపీ క్యాడర్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత ఫిల్మ్ జర్నలిస్టులు బాత్‌రూమ్‌లోని క్రిముల కంటే నీచమైన వాళ్లంటూ.. పిచ్చి కామెంట్స్ చేశాడు. ఎవరేం చేసినా ఆ మాటలపై తగ్గను అన్నాడు. ఎంత మంచి నటుడు అయితే ఏంటి.. నోటికి హద్ద పొద్దు ఉండాలిగా. తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కడం పరిపాటిగా మారిపోయింది. అయ్యా శ్రీకాంత్, నటుడిగా ఓకే..మనిషిగా నాట్ ఓకే అంటూ ఆయనపై సోషల్ మీడియా తిట్లతో దుమ్మెత్తిపోస్తోందిప్పుడు.
Admin
Studio18 News