Monday, 08 December 2025 03:15:38 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Katrina Kaif: కత్రినా కైఫ్ విషయంలో తప్పు చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు... నెటిజన్ల భారీ ట్రోలింగ్

Date : 07 November 2025 06:47 PM Views : 62

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తల్లిదండ్రులైన బాలీవుడ్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కూతురు పుడుతుందని చెప్పిన జ్యోతిష్కుడి జోస్యం విఫలం బాలీవుడ్ ప్రముఖ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ దంపతులు తల్లిదండ్రులయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను వారు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తమకు కుమారుడు జన్మించిన విషయాన్ని ప్రకటిస్తూ విక్కీ-కత్రినా ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. "మా జీవితంలో ఆనందం రెట్టింపు అయింది. అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో మా మగబిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నాము" అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఓ జ్యోతిష్కుడిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో అనిరుధ్ కుమార్ మిశ్రా అనే ప్రముఖ జ్యోతిష్కుడు.. కత్రినా-విక్కీ జంటకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుడుతుందని జోస్యం చెప్పారు. అప్పట్లో ఆ వార్త బాగా వైరల్ అయింది. ఇప్పుడు వారికి మగబిడ్డ పుట్టడంతో, ఆ జ్యోతిష్కుడి అంచనా తప్పిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్.. 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. సినిమాల విషయానికొస్తే, విక్కీ కౌశల్ ఇటీవల ‘ఛావా’ చిత్రంతో విజయాన్ని అందుకోగా, ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిస్తున్నారు. కత్రినా కైఫ్ చివరిసారిగా 2024లో విజయ్ సేతుపతితో కలిసి ‘మెర్రీ క్రిస్మస్‌’ చిత్రంలో కనిపించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :