Saturday, 24 January 2026 08:44:39 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

చంపేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు... ఇది కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే!

Date : 09 June 2025 05:18 PM Views : 422

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : బాలీవుడ్ ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లకు మరోసారి బెదిరింపులు రావడం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి గురువారం రాత్రి బెదిరింపు సందేశం రాగా, షారుఖ్ ఖాన్‌కు మంగళవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. ఈ రెండు ఘటనలపై ముంబై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. రూ.5 కోట్ల డిమాండ్! పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 5, గురువారం రాత్రి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఒక బెదిరింపు సందేశం అందింది. "మై సికిందర్ హూఁ" అనే పాట రచయితను ప్రస్తావిస్తూ వచ్చిన ఈ సందేశంలో, నటుడు సల్మాన్ ఖాన్ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. ఈ బెదిరింపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వర్లీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సల్మాన్ ఖాన్‌కు గతంలోనూ పలుమార్లు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్‌కు రూ.50 లక్షల కోసం బెదిరింపు కాల్ మరో ఘటనలో, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు కూడా బెదిరింపులు వచ్చాయి. జూన్ 3, మంగళవారం బాంద్రా పోలీసులకు ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి, షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను "హిందుస్థానీ"గా పరిచయం చేసుకున్నాడు. డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోతే షారుఖ్ ఖాన్‌ను హతమారుస్తానని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్‌ను ట్రేస్ చేయగా, అది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే న్యాయవాది పేరు మీద ఉన్నట్లు తేలింది. అయితే, తన ఫోన్ దొంగిలించబడిందని ఫైజాన్ ఖాన్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ముంబై పోలీసులు అతడిని విచారణ నిమిత్తం పిలిపించారు. గతంలో కూడా షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యంగా 2023 అక్టోబర్‌లో 'పఠాన్', 'జవాన్' సినిమాల విడుదల సమయంలో వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఆయన భద్రతను వై-ప్లస్ కేటగిరీకి పెంచారు. ప్రస్తుతం తాజా బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. రెండు వేర్వేరు ఘటనలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ వరుస బెదిరింపులతో బాలీవుడ్‌లో భద్రతాపరమైన ఆందోళనలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :