Sunday, 08 March 2026 04:00:51 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Devara Movie : రేపే ‘దేవర’ రిలీజ్.. దేవర గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

Date : 26 September 2024 03:25 PM Views : 270

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Devara Movie : ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా రేపు సెప్టెంబర్ 27 రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.. #ఎన్టీఆర్ ఆరేళ్ళ తర్వాత సోలో హీరోగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. #RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా కావడంతో ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో అంచనాలు బాగా ఉన్నాయి. #రాజమౌళితో సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమా కావడంతో హిట్ కొట్టి.. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ఫ్లాప్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు. #ఎన్టీఆర్ ఇందులో డ్యూయల్ రోల్ లో నటించారు. గతంలో ఆంధ్రావాలా, అదుర్స్, శక్తి సినిమాల్లో డ్యూయల్ రోల్, జై లవకుశ సినిమాలో ట్రిపుల్ రోల్ చేసాడు. #శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. #బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూడా ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సైఫ్ విలన్ గా నటిస్తున్నాడు. #దేవర పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. #దేవర సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. #ఈ సినిమా చాలా శాతం సముద్రం పక్కనే షూట్ చేసారు. ఎక్కువగా అండమాన్, గోకర్ణ, గోవా, థాయ్ లాండ్ తో పాటు రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్స్ లో షూటింగ్ చేసారు. #సినిమాలో సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు దాదాపు అరగంట పాటు ఉండనున్నాయి. #సముద్రంలో యాక్షన్ సీక్వెన్స్ ల కోసం మూవీ టీమ్ దాదాపు నెలరోజులకు పైగా కష్టపడ్డారు. #ఈ సినిమా కోసం సముద్రం సెట్ వేశారు. #దేవర ట్రైలర్ లో చూపించిన షార్క్ సీన్ తీయడానికే ఒక రోజు పట్టింది. #దేవర సినిమాకు చాలా తక్కువ ప్రమోషన్స్ చేయడం గమనార్హం. #ఈ సినిమాకు ఎన్టీఆర్ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లో డబ్బింగ్ చెప్పారు. #దేవరలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ తో పాటు శృతి మరాఠీ, శ్రీకాంత్, నరైన్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, కలైరాసన్, మురళి శర్మ, అజయ్, హిమజ.. ఇలా పలువురు నటీనటులు నటిస్తున్నారు. #ఇప్పటికే దేవర నుంచి మూడు సాంగ్స్, రెండు ట్రైలర్స్, గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. #అమెరికాలో అత్యధిక వేగంగా 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాగా దేవర నిలిచింది. #దేవర సినిమాను లాస్ ఏంజిల్స్ లోని బియాండ్ ఫెస్ట్ లో నేడు ప్రదర్శించనున్నారు. #దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. RRR కాకుండా ఎన్టీఆర్ కెరీర్లో ఇదే అత్యధికం. #దేవర సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ఎక్స్ ట్రా షోలు వేసుకోడానికి ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు లభించాయి. #500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకొని దేవర సినిమా బరిలోకి దిగుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :