Thursday, 12 March 2026 03:14:28 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Rashmika Mandanna: 19 ఏళ్ల వయసులో రష్మిక తొలి ఆడిషన్..

Date : 08 October 2024 02:59 PM Views : 286

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయిన రష్మిక మందన్న 19 ఏళ్ల వయసులో హాజరైన ఓ ఆడిషన్‌కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి అభిమానులను కట్టిపడేస్తోంది. 2014లో కాలేజీ రోజుల్లో ‘ఫ్రెష్ ఫేస్ కాంపిటిషన్’ విజేతగా నిలిచిన రష్మిక 2016లో తెరంగేట్రం చేసింది. 2017లో సహ నటుడు రక్షిత్ షెట్టితో ఎంగేజ్‌మెంట్ అయినా వ్యక్తిగత కారణాలతో 2018లో అది రద్దయింది. 2018లో ‘చలో’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కాలు మోపిన రష్మిక ఆ తర్వాత ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సీతా రామం’, ‘పుష్ప’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోని పలు భాషల్లోనూ సినిమాలు చేసింది. 2022లో ‘గుడ్ బై’ సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప: ది రూల్’, కుబేర, రెయిన్ బో, ద గాళ్ ఫ్రెండ్, చావా, సికందర్ వంటి సినిమాలు చేస్తోంది . తాజాగా వైరల్ అవుతున్న రష్మిక తొలి ఆడిషన్ వీడియో క్లిప్‌లో ఆమె తనను తాను పరిచయం చేసుకుంటూ తన వయసు 19 ఏళ్లని, కాలేజీ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో కొంత ఉద్వేగంగా కనిపించింది. కన్నడలో మాట్లాడాలని నిర్వాహకులు కోరగా రష్మిక కొంత తడబడింది. ‘‘నాకు అర్థం కాలేదు. నేను చేయలేను’ అని చెప్పుకొచ్చింది. అయితే, వీడియో చివరికొచ్చేసరికి మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించింది. అంతేకాదు, ‘ఆజా నాచ్‌లే’ అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ కూడా చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :