Monday, 19 January 2026 07:10:12 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Johnny Master: మైనర్‌ బాలికను లోబరుచుకున్నాడు: జానీ మాస్టర్‌పై చిన్మయి తీవ్ర ఆరోపణలు

Date : 12 November 2025 07:25 PM Views : 250

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : జానీ మాస్టర్‌పై మరోసారి ఫైర్ అయిన సింగర్ చిన్మయి మైనర్‌ను లైంగికంగా వేధించాడని తీవ్ర ఆరోపణలు పలుకుబడితో కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడని విమర్శ అతని భార్య ఫోన్ చేసి మాట్లాడొద్దని చెబుతోందని వెల్లడి నిర్దోషిగా తేలితే అవార్డులు వస్తాయని, విజయోత్సవాలు చేసుకుంటారని వ్యాఖ్య సినీ గాయని, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద మరోసారి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ తన పలుకుబడిని ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జానీ మాస్టర్ కేసు చాలా క్లిష్టమైనదని, కొందరు దీన్ని ఇద్దరి సమ్మతితో జరిగిన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చిన్మయి ఆరోపించారు. "ఒక మేజర్ అయిన వ్యక్తి మైనర్ బాలికను లోబరుచుకున్నప్పుడు అది కచ్చితంగా మేజర్‌దే తప్పవుతుంది. బాధితురాలు సహకరించనప్పుడు బెదిరించి లొంగదీసుకోవడం దారుణం" అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై తాను మాట్లాడిన ప్రతిసారి జానీ మాస్టర్ భార్య తనకు ఫోన్ చేసి మాట్లాడవద్దని చెబుతోందని చిన్మయి వెల్లడించారు. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు ఉన్నాయని ఆమె అంటున్నారని తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడి కారణంగా జానీ మాస్టర్ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఒకవేళ కోర్టు తీర్పు వారికి అనుకూలంగా వస్తే, ఇక అవార్డుల మీద అవార్డులు వస్తాయని, అతన్ని విమర్శించిన వారే అతని నిర్దోషిత్వం గురించి గొప్పగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. "మైనర్ బాలికలతో శృంగారాన్ని థ్రిల్‌గా భావించే మహానుభావులకు ఈ అంశం మరింత ఉపకరిస్తుంది. భారీ స్థాయిలో విజయోత్సవాలు జరుపుకోవచ్చు. మైనర్లను వేధించి ఎలా తప్పించుకోవాలో వారికి కచ్చితంగా తెలుస్తుంది" అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా, ఆ బాధితురాలైన అమ్మాయి విజయం సాధించాలని తాను ప్రార్థిస్తున్నానని చిన్మయి తెలిపారు. నిందితుడికి శిక్ష పడి, ఆమెకు న్యాయం జరగాలని ఆశిస్తున్నట్లు తన పోస్టులో ముగించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :