Saturday, 07 March 2026 08:44:32 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Actor Upendra | కన్నడ నటుడు ఉపేంద్ర భార్య ప్రియాంక ఫోన్‌ హ్యాక్‌..

Actor Upendra | కన్నడ స్టార్‌ నటుడు ఉపేంద్ర కుటుంబం సైతం సైబర్‌ నేరగాళ్ల బారినపడింది. ఉపేంద్ర భార్య ప్రియాంక ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైంది. తన భార్య ఫోన్

Date : 15 September 2025 08:16 PM Views : 627

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Actor Upendra | కన్నడ స్టార్‌ నటుడు ఉపేంద్ర కుటుంబం సైతం సైబర్‌ నేరగాళ్ల బారినపడింది. ఉపేంద్ర భార్య ప్రియాంక ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైంది. తన భార్య ఫోన్ నంబర్ల నుంచి మెస్సేజ్‌లు పంపి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని.. మెస్సేజ్‌లకు స్పందించవచ్చని నటుడు ఉపేంద్ర అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ‘జాగ్రత్తగా ఉండండి’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.

ప్రియాంక ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని పేర్కొన్నారు. హ్యాకర్లు మెస్సేజ్‌లు పంపిస్తూ యూపీఐ ద్వారా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లుగా సమాచారం. హ్యాకర్లు సెలబ్రిటీ జంటగా పేరు చెప్పి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందంటూ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. తమ నెంబర్లు, పేరుతో వచ్చే మెస్సేజ్‌లకు స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. ఉపేంద్ర భార్య ప్రియాంక సైతం హ్యాకర్లు తమకు తెలిసిన కొందరికి మెస్సేజ్‌ చేసి రూ.55వేలు డిమాండ్‌ చేసినట్లుగా స్క్రీన్‌షాట్‌ని షేర్‌ చేసింది. డబ్బులు పంపే సమయంలో పరిచయం ఉన్న వ్యక్తులు ఫోన్‌ చేశారని.. హ్యాకర్‌ తర్వాత మాట్లాడుతానని చెప్పి రూ.55వేలు పంపాలని.. చాలా అత్యవసరం ఉందని చెప్పినట్లుగా ప్రియాంక తెలిపింది. హ్యాకింగ్‌ అంశంపై ఉపేంద్ర-ప్రియాంక జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారాన్ని చెప్పినందుకు నెటిజన్లు ఉపేంద్ర, ప్రియాంక జంటకు ధన్యవాదాలు తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :