Thursday, 12 March 2026 12:15:55 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Bunny Vasu: ఆ రోజున అలా మాట్లాడకుండా ఉండాల్సింది: బన్నీ వాసు

Date : 31 December 2025 06:43 PM Views : 90

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : నిర్మాతగా బన్నీవాసుకి మంచి పేరు 'మిత్రమండలి' నష్టాల గురించిన ప్రస్తావన 6 కోట్ల నష్టం తెచ్చిపెట్టిందని వ్యాఖ్య తన అంచనాలు తప్పాయని వెల్లడి అందుకే హద్దులు దాటానని వివరణ బన్నీ వాసు .. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చిన పేరు. నిర్మాతగా ఆయన తనదైన మార్క్ చూపిస్తూ వెళుతున్నారు. చిన్న సినిమాలతోనే పెద్ద విజయాలను అందుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నారు. ఒక సినిమా సక్సెస్ ను అంచనా వేయడంలో ఆయనకి మంచి అనుభవం ఉందని అందరూ నమ్ముతుంటారు. అలాంటి బన్నీ వాసు 'మిత్రమండలి' అనే సినిమా విషయంలో రెండు పొరపాట్లు చేశారనే ఒక టాక్ కాస్త బలంగానే వినిపించింది. తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న బన్నీవాసుకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ, 'మిత్రమండలి' సినిమా విషయంలో నా అంచనా తప్పు అయిందనే చెప్పాలి. ఫస్టు కాపీ చూసుకోవలసిన సమయంలో నేను ఇక్కడ లేకపోవడం కూడా అందుకు కారణంగా చెప్పుకోవాలి. అందువలన ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు నాకు అనిపించిందే చెప్పాను. తప్పు ఎక్కడ జరిగిందనేది, థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడే, నాకు అర్థమైంది. ఆ సినిమా వలన 6 కోట్ల నష్టం వచ్చింది" అని అన్నారు. " ఇక 'మిత్రమండలి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో మాటల పరంగా కూడా నేను కాస్త లిమిట్ దాటడం జరిగింది. ఆ తరువాత ఆ విషయాన్ని గురించి అరవింద్ గారు కూడా నాతో మాట్లాడారు. ఆ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేసిన ఒక వ్యక్తికి అంతకుముందే హార్ట్ ఎటాక్ రావడం, ఈ సినిమా విడుదలకి ముందే కొంతమంది నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేయడం గురించి వినడం జరిగింది. అందువల్లనే ఆ రోజున స్టేజ్ పై అలా మాట్లాడాను. ఇకపై అలా హద్దులు దాటకూడదని మాత్రం బలంగా నిర్ణయించుకున్నాను" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :