Sunday, 25 January 2026 04:55:56 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Annapurnamma: అత్యాశకు పోతే అవస్థలు తప్పవు మరి: నటి అన్నపూర్ణ

తల్లిదండ్రులు పొరపాటు చేస్తున్నారన్న అన్నపూర్ణ పిల్లలకు కష్టం తెలియాలంటూ చేసిన సూచన సెన్సిటివ్ గా పెంచితే ఇబ్బందులు తప్పవని వ్యాఖ్య ఎదుటివారితో పోల్

Date : 17 March 2025 04:36 PM Views : 298

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : తెలుగు తెరపై అమ్మ పాత్రలకు పెట్టింది పేరు అన్నపూర్ణమ్మ. వందలాది సినిమాలలో నటించిన అన్నపూర్ణమ్మ మంచి మాటకారి అనే విషయం చాలామందికి తెలుసు. అలాంటి ఆమె తాజాగా 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "ఇప్పటి పిల్లలు మూర్ఖంగా తయారవడానికి తల్లిదండ్రులే కారణమవుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలు అడగ్గానే డబ్బు ఇచ్చేస్తూ ఉండటం వలన వాళ్లకి కష్టం తెలియకుండా పోతోంది"అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "తల్లిదండ్రులు పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించకపోవడం వలన, వారి మనసులో ఏముందో తెలుకునే అవకాశం లేకుండా పోతోంది. దాంతో చిన్న కష్టానికి కూడా తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక ఈ కాలంలో లవ్ విషయానికి వస్తే .. అది శుద్ధ అబద్ధమనే చెప్పాలి. కొంతమంది పిల్లలు కొన్ని ఆకర్షణలకు లోనై తల్లిదండ్రుల పేరు చెడగొడుతున్నారు. అందువలన పిల్లలు కాస్త ఆలోచన చేయాలి" అని అన్నారు. "ఇక ఈ రోజుల్లో చాలామంది అత్యాశకు పోతున్నారు. ఎదుటివారికి ఏదుంటే అది తమకి కూడా ఉండాలని భావిస్తున్నారు. దాంతో తాహతు లేకపోయినా కార్లు... ఫ్లాట్లు కొంటున్నారు. అందుకు అవసరమైన డబ్బు కోసం మోసాలు చేస్తున్నారు. దార్లో కంకరరాళ్లు ఉన్నాయిగదా అని గెంతుతూ వెళ్లకూడదు. మంచి రోడ్డు వచ్చేవరకూ నిదానంగా నడవాలి. జీవితం పట్ల కూడా అలాగే ఉండాలి. అత్యాశకు పోనంతవరకూ ఆరోగ్యంగా ఉంటాం... ఆరోగ్యం బాగున్నంత వరకూ హాయిగా ఉంటాం" అని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :