Wednesday, 17 December 2025 04:02:50 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Raja Saab : ప్రభాస్ బర్త్ డేకి రాజాసాబ్ టీజర్..? అప్పట్నుంచి వరుస అప్డేట్స్..

Date : 14 October 2024 04:49 PM Views : 258

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Raja Saab : మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. హారర్, రొమాంటిక్, కామెడీ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. 2025 ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర అప్‌డేట్స్ కోసం సినీ ప్రియులు అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. నిర్మాత శ్రీనివాస కుమార్ (ఎస్‌కేఎన్‌) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంద‌న్నారు. అక్టోబ‌ర్ 23 (ప్ర‌భాస్ పుట్టిన రోజు) నుంచి ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ ప్రారంభం అవుతాయ‌న్నారు. ఆ త‌రువాత నుంచి వ‌రుస‌గా అప్‌డేట్స్ వ‌స్తాయ‌న్నారు. ఇందుకోసం దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వ ప్రసాద్ ప్ర‌ణాళిక‌ల‌ను వేసుకున్న‌ట్లుగా చెప్పారు. అక్టోబర్‌ 23 నుంచి రిలీజ్ వరకు రాజాసాబ్‌ ప్రపంచంలోకి ప్రేక్ష‌కుల‌ను తీసుకువెళ్ల‌నున్న‌ట్లు తెలిపారు. ఇక‌ దర్శకుడు మారుతి ఒక్క రోజు కూడా స‌మ‌యం వృథా చేయ‌కుండా షూటింగ్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నార‌న్నాడు. వినాయకచవితి, దసరా ఇలా ఏ పండగకు కూడా ఆయన సెలవు తీసుకోలేద‌ని, కష్టపడుతున్నార‌న్నారు. అనుకున్న సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పట్టుదలతో మారుతి ఉన్న‌ట్లు చెప్పారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్​ సినిమాల తర్వాత ప్రభాస్ న‌టిస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్నారని అంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :