Monday, 19 January 2026 08:36:02 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Samantha-Raj Nidimoru | ‘భూతశుద్ధి’ వివాహం చేసుకున్న సమంత.. ఈ పెళ్లి ప్రత్యేకత ఏంటీ..? ఎందుకు చేసుకుంటారంటే..?

Samantha-Raj Nidimoru | టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత రూత్‌ ప్రభు మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ డైరెక్టర్‌ రాజ్‌ నిడమోరును పెళ్

Date : 01 December 2025 07:08 PM Views : 333

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Samantha-Raj Nidimoru | టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత రూత్‌ ప్రభు మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ డైరెక్టర్‌ రాజ్‌ నిడమోరును పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌ యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో సోమవారం సంప్రదాయబద్ధం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కొద్ది మంది కుటుంబీకులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సమంతా స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం వీరి పెళ్లి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సమంత-రాజ్‌ల వివాహంపై ఈశా ఫౌండేషన్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. సమంత-రాజ్‌ ‘భూతశుద్ధి వివాహం’ అనే ప్రత్యేక యోగ సంప్రదాయం విధానంలోకి జరిగిందని పేర్కొంది. దాంతో చాలా మంది ‘భూత శుద్ధి వివాహం’ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈశా ఫౌండేషన్‌ ఇచ్చిన వివరణ ప్రకారం.. ‘భూత శుద్ధి వివాహం’ అనేది వేల సంవత్సరాలుగా యోగ సంప్రదాయంలో కొనసాగుతున్న పవిత్రమైన వివాహ పద్ధతి. పేరుకు తగినట్లుగానే ఇది మనుషుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేయడం. వాటిని సమతుల్యంలో ఉంచడం, దంపతుల మధ్య ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా లోతైన బంధాన్ని ఏర్పరిచే ఆధ్యాత్మిక ప్రక్రియగా పేర్కొంది. సాధారణ పెళ్లిల్ల తరహానే సంప్రదాయ మంత్రోచ్ఛారణలతో వధూవరుల శరీరం, మనసు, జీవశక్తి స్థాయులను చేసే యోగిక క్రతువులతో నిర్వహిస్తారు. లింగ భైరవి ఆలయాల్లో, ఈశా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే ఈ విధానంలో పెళ్లిళ్లు నిర్వహిస్తారు. ఈ విధానంలో పెళ్లి జరుగడం వల్ల దాంపత్య జీవితం సామరస్యంగా, శాంతియుతంగా ఉండడంతో పాటు శ్రేయస్సును తీసుకువస్తుందని తెలిపింది. ఈ దంపతుల జీవితంలో ఆధ్యాత్మికత వికసించేందుకు, పరస్పర అనురాగం మరింత బలపడేందుకు, భవిష్యత్తులో దంపతుల ప్రయాణం శాంతి, సౌఖ్యాలతో నిండిపోవడానికి సహాయపడుతుందని ఈశా ఫౌండేషన్‌ వివరించింది. అయితే, లింగభైరవి ఆలయం స్త్రీశక్తికి చెందిన ఉగ్ర కారుణ్య స్వరూపాల సమ్మేళనమని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ గతంలో తెలిపారు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. వాస్తవానికి సమంత గత కొద్ది సంవత్సరాలుగా లింగభైరవి ఉపాసన చేస్తున్నది. దాంతోనే ఇష్టపడ్డ రాజ్‌ను అగ్నిహోత్రం సాక్షిగా వివాహం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ వివాహంలో మరో ప్రత్యేకత ఏంటంటే అన్ని క్రతువులను కేవలం మహిళా పూజారి నిర్వహించడం. హిందూ సంప్రదాయంలో పెళ్లికి ముహూర్తం తప్పనిసరిగా చూస్తారు. వధూవరుల జాతకాల ఆధారంగా పెళ్లికి సుముహూర్తం నిర్ణయిస్తారు. కానీ, ఈ భూతశుద్ధి వివాహానికి ముహూర్తంతో సంబంధం ఉండదు. ఎప్పుడైనా ఈ పెళ్లి చేసుకోవచ్చు. ప్రస్తుతం పెళ్లిళ్లకు ఎలాంటి సు ముహూర్తాలు లేకపోవడంతో సమంత ఈ పద్ధతిని కూడా ఎంపిక చేసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :