Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'గేమ్ చేంజర్'. దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో దీనిపై హైప్ ఓ రేంజిలో కొనసాగుతోంది. ఇప్పటికే 'గేమ్ చేంజర్' చిత్రం నుంచి విడుదలైన 'జరగండి' పాట ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా, మరో పాట విడుదలకు రంగం సిద్ధమైంది. 'రా మచ్చా మచ్చా' అనే పాటకు సంబంధించి నేటి సాయంత్రం 6.03 గంటలకు అప్ డేట్ విడుదల చేయనున్నట్టు సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. 'రా మచ్చా మచ్చా' పాటకు అనంతశ్రీరామ్ సాహిత్యం సమకూర్చారు. దర్శకుడు శంకర్ స్పందిస్తూ... రా మచ్చా మచ్చా పాట కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు. కాగా, ఈ పాటకు సంబంధించిన ప్రోమో ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేసింది. దాంతో, ఈ సాయంత్రం చిత్రబృందం చెప్పే కబురు కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'గేమ్ చేంజర్' చిత్రంలో సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న 'గేమ్ చేంజర్' చిత్రం ఈ ఏడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Admin
Studio18 News