Sunday, 08 March 2026 04:45:21 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులు.. దెబ్బకు సినిమానే ఆపేశారు.. కారణం ఏంటంటే

Date : 24 March 2025 11:26 AM Views : 464

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత తేజ్ స్పీడ్ తగ్గించాడు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ ఆతర్వాత బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు తేజ్.

సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రస్తుతం సంబరాల ఎటి గట్టు అనే సినిమా చేస్తున్నాడు. తేజ్ తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు. కెరీర్ లో ఎన్నో ఫ్లాప్స్ చూశాడు. ఆతర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. చిత్రలహరి, సోలో బ్రతుకే సోబెటర్, రిపబ్లిక్, విరూపాక్ష సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు తేజ్. ఇక తేజ్ ఆ మధ్య గంజా శంకర్ అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఓ వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేశారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఏమైపోయిందో తెలియదు. ఎక్కడ గంజా శంకర్ సినిమా గురించిన టాక్ లేదు. దీని పై తాజాగా దర్శకుడు సంపత్ నంది స్పందించాడు. సంపత్ నంది ప్రస్తుతం ఓదెల 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంపత్ మాట్లాడుతూ.. సినిమాను ఆపేశాం అని తెలిపాడు. గంజా శంకర్ సినిమాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నాకు, సాయి ధరమ్ తేజ్ కు, నిర్మాతకు నోటీలు ఇచ్చారు పోలీసులు. కథను బట్టి టైటిల్ పెట్టాం.. అయితే టైటిల్ మార్చమని చెప్పారు. టైటిల్ మార్చితే కథ పూర్తిగా మార్చాలి దాని కంటే సినిమా ఆపేయడమే బెటర్ అనిపించింది ఆపేశాం అని తెలిపాడు సంపత్ నంది. ‘గాంజా శంకర్’ మూవీకి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మూవీలో గంజాయి పదాన్ని తొలగించాలని నోటీసులో సూచించారు టిఎస్ న్యాబ్ పోలీసులు. సినిమాలో మాదకద్రవ్యాల సంబంధించిన అభ్యంతరక సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ – 1985 చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ఈ చిత్రంలో గంజాయి మొక్కల్ని చూపించడంతోపాటు ప్రోత్సాహిస్తున్నట్లు సన్నివేశాలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.అలాగే సినిమా టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాలను వినియోగాన్ని సాధారణంగా ఉన్నట్లు సినిమాలో సన్నివేశాలను ఉంటే వాటిని వెంటనే తొలగించాలని.. గంజాయి సన్నివేశాలు డైలాగులు లేకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నారు టీఎస్ న్యాబ్ పోలీసులు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :