Thursday, 12 March 2026 04:15:26 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Vijay : దళపతి 69 మూవీ లాంచ్‌..

Date : 04 October 2024 03:42 PM Views : 238

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు చెన్నైలో జ‌రిగాయి. విజ‌య్ కెరీర్‌లో 69 మూవీగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. త‌న సినీ కెరీర్‌లో విజ‌య్‌కు ఇదే చివ‌రి చిత్రం అని ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. పూజా కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌. ప్రేమలు ఫేం మమితా బైజు, ప్రకాశ్‌ రాజ్‌, ప్రియమణి, నరేన్‌, గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌, బాబీడియోల్ లు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే మొదలు కానున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని 2025 అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ఇప్ప‌టికే వెల్ల‌డించింది. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో ‘తమిళగ వెట్రి కళగం’ అనే పార్టీని విజ‌య్ స్థాపించారు. 2026లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని, అంత‌క ముందు జ‌రిగే ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌ద‌ని విజ‌య్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. ఇక పై సినిమాలు కూడా చేయ‌నని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :