Saturday, 24 January 2026 09:19:10 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Mohanlal: మార్చి 20న 'L2E: ఎంపురాన్' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో ఎల్2ఈ ఎంపురాన్ ప్రపంచవ్యాప్తంగా మార్చి 27న విడుదల తొలిసారిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ట్రైలర్ విడుదల తెలుగులో వి

Date : 20 March 2025 12:21 PM Views : 357

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే అంచనాలు పెంచేస్తూ, మార్చి 20న మధ్యాహ్నం 1.08 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముంబైలోని ఐనాక్స్ మెగాప్లెక్స్, ఇనార్బిట్ మాల్‌లో ‘L2E: ఎంపురాన్’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. మలయాళ సినీ చరిత్రలోనే తొలిసారిగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ట్రైలర్ విడుదల కావడం విశేషం. 2019లో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన లూసిఫర్‌కు ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఈ సినిమా మూడు భాగాలుగా రానుండగా, ఇది రెండవ భాగం. మోహన్‌లాల్ ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ గోపి కథను అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ‘L2E: ఎంపురాన్’ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానుంది. హిందీలో అనీల్ తడానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్, కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్, తమిళనాడులో గోకులం గోపాలన్ విడుదల చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :