Thursday, 12 March 2026 03:58:59 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

'కంగువా' కోలీవుడ్ కొత్త రికార్డును సెట్ చేయనుందా?

సూర్య తాజా చిత్రంగా 'కంగువా' విజువల్ వండర్ గా రెడీ చేస్తున్న శివ కీలక పాత్రల్లో జగపతి బాబు - బాబీ డియోల్ ఈ నెల 14న పాన్ ఇండియా రిలీజ్ 1000 కోట్ల వసూ

Date : 11 November 2024 12:42 PM Views : 329

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఇప్పుడు బాలీవుడ్ .. టాలీవుడ్ .. కోలీవుడ్ .. ఇలా ఎక్కడ చూసినా, సీనియర్ స్టార్ హీరోలు ప్రయోగాల వైపు వెళుతుండటం కనిపిస్తోంది. తాము ఎంచుకున్న కంటెంట్ వలన తెరపై కొత్తగా కనిపించడానికి ఆసక్తిని చూపుతున్నారు. తమ కెరియర్లో ఎప్పటికీ మిగిలిపోయే అద్భుతమొకటి చేరిపోవాలని ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. చరిత్ర .. పౌరాణికం .. సైన్స్ ఫిక్షన్ .. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా, దానిని విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరహా కథలను నిర్మించడానికి వందల కోట్లను ఖర్చు చేయడానికి మేకర్స్ వెనుకాడటం లేదు. ప్రపంచ మార్కెట్ ఇప్పుడు అందుబాటులో ఉండటం వలన సాహసాలు చేయడానికి భయపడటం లేదు. అలా రూపొందిన సినిమాలలో 'కంగువా' ఒకటిగా కనిపిస్తోంది. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను, స్టూడియో గ్రీన్ - యూవీ బ్యానర్లు కలిసి నిర్మించాయి. ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతూ వచ్చిన ఈ సినిమా, ఈ నెల 14న థియేటర్లకు రావడానికి ముస్తాబవుతోంది. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. జగపతిబాబు .. బాబీ డియోల్ .. దిశా పటాని .. యోగిబాబు .. కోవై సరళ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సూర్య కెరియర్ లోనే కాదు, తమిళనాట కూడా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుందనే టాక్ వినిపిస్తోంది. 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ స్థాయిని ఈ సినిమా అందుకుంటుందేమో చూడాలి మరి.

Also Read : లవ్ స్టోరీస్ జోరు తగ్గినట్టేనా

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :