Thursday, 12 March 2026 03:16:46 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

తల్లి అయినా తగ్గేదే లే అంటున్న దీపికా పదుకునే

Date : 17 May 2025 11:33 AM Views : 495

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : అందంతో పాటు అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే... ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నారు. తల్లి అయిన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రెమ్యునరేషన్ విషయంలో ఇతర హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తోంది. పెళ్లి అయ్యాక కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించిన ఆమె, త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకు రానున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ముఖ్యంగా, రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’లో దీపిక నటించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో, ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించేందుకు దీపికా అంగీకరించినట్లు, దీనికిగానూ ఆమె ఏకంగా రూ. 20 కోట్ల పారితోషికం అందుకోనున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే ఒక నటికి ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం దీపికా క్రేజ్‌కు నిదర్శనమని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలుపుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :