Thursday, 12 March 2026 04:22:13 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Vijayshanti: 'ప్రతిఘటన' చిత్రానికి 40 ఏళ్లు... విజయశాంతి భావోద్వేగ స్పందన

Date : 11 October 2025 07:31 PM Views : 382

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : విజయశాంతి 'ప్రతిఘటన' చిత్రానికి 40 ఏళ్లు పూర్తి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టిన రాములమ్మ నన్ను సూపర్‌స్టార్‌గా నిలబెట్టిన చిత్రమన్న విజయశాంతి దర్శకుడు టి. కృష్ణ, నిర్మాత రామోజీరావుకు కృతజ్ఞతలు తెలుగు సినిమాలో మహిళా పోరాటానికి ప్రతీకగా నిలిచిన సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉన్న చిత్రం తెలుగు సినీ చరిత్రలో మహిళా ప్రాధాన్య చిత్రాలకు ఓ కొత్త దారి వేసిన 'ప్రతిఘటన' విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ చిత్రంతో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన విజయశాంతి సోషల్ మీడియా వేదికగా తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఒక మైలురాయి అని, తనకు ఎప్పటికీ ప్రత్యేకమని ఆమె పేర్కొన్నారు. తన కెరీర్‌లో 'ప్రతిఘటన'కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. "నన్ను సూపర్‌స్టార్‌గా నిలబెట్టిన సంచలన చిత్రం ప్రతిఘటన" అని ఆమె తన పోస్టులో తెలిపారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు టి. కృష్ణ, ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే, 'ఈ దుర్యోధన దుశ్శాసన' వంటి ఐకానిక్ పాటను అందించిన గేయ రచయిత వేటూరి సుందరరామమూర్తిని కూడా ఆమె స్మరించుకున్నారు. చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 1985 అక్టోబర్ 11న విడుదలైన 'ప్రతిఘటన' అప్పట్లో ఓ పెను సంచలనం. రాజకీయ అండతో సమాజంలో అరాచకాలు సృష్టిస్తున్న ఓ రౌడీని, ఓ సామాన్య మహిళ ఎదిరించిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. మహిళల పోరాట పటిమకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, విజయశాంతిని తెలుగు సినిమా అగ్ర కథానాయికగా నిలబెట్టింది. విడుదలై నాలుగు దశాబ్దాలు గడిచినా, ఈ చిత్రం ఇప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. 'ప్రతిఘటన' ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :