Monday, 19 January 2026 08:05:29 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం

Akhanda 2 | నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘అఖండ 2’ .ఈ మూవీ విడుదలపై నెలకొన్న సందిగ్ధతలు తొలగిపోయినట్టే కనిపిస

Date : 09 December 2025 07:52 PM Views : 162

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Akhanda 2 | నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘అఖండ 2’ .ఈ మూవీ విడుదలపై నెలకొన్న సందిగ్ధతలు తొలగిపోయినట్టే కనిపిస్తున్నాయి. అసలు ఈ చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా రీలీజ్ కావాల్సి ఉండగా, ఫైనాన్స్ సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 12నే కొత్త రిలీజ్ డేట్‌గా దాదాపు ఖరారైందని, ఈ రోజు లేదా రేపు అధికారిక ప్రకటన రావొచ్చ‌ని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అప్డేట్‌తో బాలయ్య అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొనగా… మరోవైపు చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం టెన్షన్‌లోకి వెళ్లారు. ‘అఖండ 2’ డిసెంబర్ 5 నుంచి 12కి మారడంతో, ముందే 12వ తేదీని లాక్ చేసుకున్న చిన్న సినిమాలకు భారీ గందరగోళం ఏర్పడింది. ఆ తేదీన సుమారు 8 చిన్న సినిమాలు విడుదల కావాల్సి ఉంది. కానీ అదే రోజున బాలయ్య హై వోల్టేజ్ సినిమాని ఎవరు ఎదుర్కోవాలంటే? బాక్సాఫీస్ రేసులో నిలవలేమన్న భయంతో ఒక్కొక్కటి వెనక్కి తగ్గుతున్నాయి.సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల హీరోగా, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘మోగ్లీ’ కూడా ఈ ప్రభావానికి గురైందని సమాచారం. ఇప్పటికే భారీ ప్రమోషన్లు చేసిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘అఖండ 2’తో పోటీ సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో నిర్మాతలు వెనక్కి తగ్గినట్టుగా ఇండస్ట్రీ టాక్. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం… ‘మోగ్లీ’ని 2026 ఫిబ్రవరికి మార్చే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. దర్శకుడు సందీప్ రాజ్ ఈ నేపథ్యంలో చేసిన భావోద్వేగ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.“రిలీజ్ విషయంలో దురదృష్టం వెంటాడుతోంది… బహుశా నేనే బ్యాడ్ లక్ కావచ్చేమో” అంటూ తన మనసులోని బాధ బయటపెట్టారు. ‘కలర్ ఫోటో’ ఓటీటీలో విడుదలైందని, ఇప్పుడు ‘మోగ్లీ’ కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘మోగ్లీ’తో పాటు అదే తేదీన రావాల్సిన మరో చిన్న చిత్రం ‘ఈషా’ కూడా వాయిదా పడినట్లు సమాచారం. అయితే కార్తీ – కృతి శెట్టిలు నటించిన ‘అన్నగారు వస్తారు’ మాత్రం డిసెంబర్ 12కే వస్తుందా? లేక రీషెడ్యూల్ అవుతుందా? అన్నది ఇంకా స్పష్టత లేదు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :