Sunday, 08 February 2026 12:29:15 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Elon Musk: సొంత సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ రికార్డు

Date : 04 October 2024 11:42 AM Views : 256

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : టెక్ బిలియనీర్, టెస్లా, స్పేస్‌ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ సొంత‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో రికార్డు సృష్టించారు. గురువారం నాటికి 'ఎక్స్‌'లో ఆయ‌న ఫాలోవ‌ర్ల సంఖ్య‌ 200 మిలియన్లకు చేరింది. దాంతో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ మార్క్‌ను అందుకున్న మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కారు. ఇక మ‌స్క్ 'ఎక్స్‌'ను 2022 అక్టోబర్‌లో 44 బిలియన్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. కాగా, మ‌స్క్ త‌ర్వాత 'ఎక్స్‌'లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు క‌లిగిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (131.9 మిలియన్లు), ఫుట్‌బాల్ దిగ్గ‌జం క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్లు) ఉన్నారు. ప్రముఖ గాయకుడు జస్టిన్ బీబర్ 110.3 మిలియన్ల‌ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉంటే.. పాప్ గాయ‌ని రిహన్నా 108.4 మిలియన్ల ఫాలోవర్లతో ఐదో స్థానంలో కొన‌సాగుతున్నారు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 100 మిలియన్ల మార్కును దాటారు. దీనిని మస్క్ కూడా ప్రశంసించారు. ప్రస్తుతం మోదీ 102.4 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఇదిలాఉంటే.. ప్ర‌స్తుతం 'ఎక్స్‌'కి 600 మిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ యాక్టివ్ యూజర్లు (ఎంఏయూలు), సుమారు 300 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు (డీఏయూలు) ఉన్న‌ట్లు ఇటీవ‌లే మస్క్ వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 'ఎక్స్‌' సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భూమిపై 'ఎక్స్' అనేది గ్రూప్ చాట్‌గా మారింద‌న్నారు. "ఎక్స్‌ అనేది భూమికి సంబంధించిన గ్రూప్ చాట్" అని మస్క్ త‌న పోస్టులో పేర్కొన్నాడు. ఇక ఈ వారం ప్రారంభంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఫిడిలిటీ ఎక్స్‌లో దాని హోల్డింగ్ విలువను ఏకంగా 78.7 శాతం తగ్గించింది. దీంతో ఎక్స్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ విలువ కేవలం 9.4 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :