Sunday, 25 January 2026 05:18:22 AM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Aditya 369 : బాలయ్య సూపర్ హిట్ సినిమా ఆదిత్య 369 రీ రిలీజ్.. ఎప్పుడంటే..

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ సినిమా 'ఆదిత్య 369' ఇప్పుడు రీ రిలీజ్ కానుంది.

Date : 18 March 2025 04:47 PM Views : 288

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Aditya 369 Movie : ఇటీవల రీ రిలీజ్ లు ప్రతివారం ఏదో ఒక సినిమా ఉంటుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు అన్ని రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి ఆనందాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు బాలయ్య సినిమా కూడా రీ రిలీజ్ కానుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఆదిత్య 369’ ఇప్పుడు రీ రిలీజ్ కానుంది. బాలకృష్ణ, మోహిని జంటగా, టిను ఆనంద్, అమ్రిష్ పూరి, సిల్క్ స్మిత.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఆదిత్య 369 సినిమా 1991లో రిలీజయి అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో బాలయ్య బాబు శ్రీ కృష్ణదేవరాయలుగా నటించి అదరగొట్టారు. భూత భవిష్యత్ ప్రస్తుత కాలాలు ఎలా ఉంటాయి అని ఆసక్తిగా చూపించారు ఈ సినిమాలో. ఇప్పుడు ఆదిత్య 369 సినిమా ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా శ్రీదేవి మూవీస్ అధినేత, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమాని 4kలో డిజిటలైజ్ చేశాం. సౌండ్ కూడా 5.1 క్వాలిటీలోకి కన్వర్ట్ చేశాం. 34 ఏళ్ళ క్రితం జూలై 18,‌ 1991న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. అప్పట్లోనే ఇది చాలా అడ్వాన్స్ సినిమా. ఈ సినిమాని నేను నిర్మించడానికి సహకరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి జీవితాంతం రుణపడి వుంటాను. ఈ సినిమాతో నిర్మాతగా నన్ను ఎన్నో మెట్లు ఎక్కించిన నందమూరి బాలకృష్ణ గారికి, సింగీతం శ్రీనివాసరావు గారికి రీ రిలీజ్ చేస్తున్నామని చెబితే చాలా ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 11న గ్రాండ్ రీ రిలీజ్ చేస్తున్నాం. నందమూరి అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు ఇదొక గొప్ప కానుక.‌ ఈ సినిమా మరోసారి ప్రేక్షాదరణ పొంది బాలయ్య బాబు హిట్ హిస్టరీని రిపీట్ చేస్తుందన్న నమ్మకం ఉంది అని అన్నారు. మరి ఈ సినిమాకు థియేటర్స్ లో బాలయ్య సీనియర్ ఫ్యాన్స్ కూడా వచ్చి సందడి చేస్తారేమో చూడాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :