Wednesday, 17 December 2025 02:26:31 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Pawan Kalyan – Karthi : కార్తీ, తిరుమల లడ్డు వివాదంపై మళ్ళీ మాట్లాడిన పవన్ కళ్యాణ్.. కార్తీ, సూర్య ఇద్దరూ..

Date : 02 October 2024 02:01 PM Views : 198

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Pawan Kalyan – Karthi : గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డు వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ ముందుండి మాట్లాడుతున్నారు. అయితే ఓ సినిమా ఈవెంట్లో కార్తీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి, లడ్డు గురించి ప్రశ్న వస్తే ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడొద్దు, సెన్సిటివ్ టాపిక్ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వడంతో ఈ వీడియో వైరల్ అయి పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది. దీంతో పవన్ కార్తీని అలా మాట్లాడొద్దు అంటూ కామెంట్ చేయడం, కార్తీ సారి చెప్పడం, పవన్ మళ్ళీ అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ కార్తీకి రిప్లై ఇవ్వడం జరిగాయి. ఇలా కార్తీ – పవన్ – లడ్డు వివాదం తెలుగుతో పాటు తమిళ రాష్టంలోనూ వైరల్ అయింది. కొంతమంది తమిళ్ వాళ్ళు కార్తీ తప్పేం లేదంటూ పవన్ ని విమర్శించారు. అయితే తాజాగా పవన్ ఓ తమిళ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కి కార్తీ గురించి ప్రశ్న ఎదురవడంతో మళ్ళీ ఆ వివాదంపై స్పందించారు. పవన్ మాట్లాడుతూ.. కార్తీ, సూర్య ఇద్దరూ భక్తులే, వాళ్ళు కూడా తిరుమలకు వెళ్లారు. కార్తీ గారు కావాలని అలా మాట్లాడలేదు. కానీ అయన అనుకోకుండా అలా మాట్లాడటం, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వడంతో అలాంటి ఇష్యూ మీద నెగిటివ్ గా వెళ్ళింది. వాళ్ళు సెలబ్రిటీ పర్సన్స్ కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనల్ని చూసి ప్రజలు ఫాలో అవుతారు. అందుకే ఆ రోజు అలా స్పందించాను. తమిళ సినీ పరిశ్రమ నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు అని అన్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :