Sunday, 08 March 2026 03:52:43 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

భార్యను మర్డర్ చేసిన ఓ గుమస్తా కథగా 'గుమస్తాన్' మూవీ!

మలయాళ మూవీగా 'గుమస్తాన్' సెప్టెంబర్ 27న విడుదలైన సినిమా థ్రిల్లర్ జోనర్లో నడిచే కథాకథనాలు నవంబర్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మొదలైన స్ట్రీమింగ్ త్వరలో

Date : 12 November 2024 12:18 PM Views : 541

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ .. మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతూ ఉంటాయి. ఈ తరహా కంటెంట్ కి ఓటీటీ వైపు నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మలయాళం నుంచి 'గుమస్తాన్' అనే ఓ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ముజఫిర్ అబ్దుల్లా నిర్మించిన ఈ సినిమాకి, అమల్ కె జోబీ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులోను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. స్టీఫెన్ దేవస్సి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, జైస్ జోస్ .. షాజూ శ్రీధర్ .. దిలీష్ పోతన్ .. రోనీ డేవిడ్ రాజ్ .. కైలాష్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. పల్లి పాదన్ (జైస్ జోస్) అనే ఒక వ్యక్తి ఓ అడ్వకేట్ దగ్గర గుమస్తాగా పనిచేస్తూ ఉంటాడు. అస్తమాను అతను భార్యతో గొడవపడుతూ ఉంటాడు. ఓ రోజున అతను భార్యతో తగవు పడుతూ ఉండగా పనిమనిషి చూస్తుంది. ఆ మరునాడు పనికి వచ్చిన ఆమెకి, యజమాని భార్య కనిపించదు. దాంతో ఆమెకి అనుమానం కలుగుతుంది. ఫలితంగా పోలీసులు రంగప్రవేశం చేస్తారు. భార్యను మర్డర్ చేసిన ఆ గుమస్తా, పోలీసులను ఎలా ముప్పతిప్పలు పెట్టాడనేది కథ.

Also Read : మంత్రి లోకేశ్ కృషితో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :