Thursday, 12 March 2026 03:29:11 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

OTT Movie: పరాయి పురుషులకు ముఖం చూపిస్తే ఆత్మాహుతి చేసుకోవాల్సిందే..అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా

సాధారణంగా సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాక సుమారు నెల రోజులకు ఓటీటీలో వస్తుంటాయి. మరికొన్ని 45 రోజలు, ఇంకొన్ని రెండు నెలల్లోపు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస

Date : 12 September 2025 07:57 PM Views : 255

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఎప్పటిలాగే ఈ శుక్రవారం (సెప్టెంబర్12) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లోకి అందుబాటులోకి వచ్చేశాయి. ఇందులో రెండు వారాల క్రితమే థియేటర్లలో రిలీజైన ఒక తెలుగు సినిమా కూడా ఉంది. బిగ్ స్క్రీన్ పై ఓ మోస్తరుగా ఆడిన ఈ డిఫరెంట్ మూవీ ఇప్పుడు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో ఇలాంటి స్టోరీతో సినిమా రాలేదని చెప్పవచ్చు.. పడతి అనే ఊరు. అక్కడ మహిళలంతా తమ ముఖం బయటకు కనిపించకుండా పరదాలు వేసుకుని తిరుగుతుంటారు. ఇంట్లో తండ్రికి తప్పితే పరాయి పురుషులకకు వాళ్ల ముఖాలు అసలు చూడకూడదు. ఒక వేళ అలా చూపిస్తే ఊరికి అరిష్టం దాపరిస్తుందని గ్రామస్తుల నమ్మకం. అంతే కాదు పిల్లలు పుట్టకుండా పురిటిలోనే చనిపోతారని ఈ ఊరి లు బలంగా నమ్ముతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే ఊరిలో పుట్టి పెరిగిన సుబ్బులక్ష్మి అదే ఊళ్లోని రాజేష్ ని చూసి ఇష్టపడుతుంది. ఇద్దరి మనసులు కలవడంతో నిశ్చితార్థం చేసుకోవాలనుకుంటారు. అయితే ఇంతలో పరదా లేని సుబ్బు ఫొటో ఒకటి బయటకు వస్తుంది. సుబ్బు ఆత్మాహుతి చేసుకోవాలని గ్రామస్తులంతా నిర్ణయిస్తారు. మరి సుబ్బు తాను తప్పుచేయలేని నిరూపించుకునేందుకు ఏం చేసింది? ఇంతకీ పరదా లేని సుబ్బు ఫొటో ఎలా బయటికొచ్చింది? పడతి అనే ఊరిలో అమలవుతోన్న ఈ కఠినమైన కట్టుబాట్ల వెనక ఉన్న కథేమిటి? ఈ చిక్కుల్లో నుంచి సుబ్బు బయట పడిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పేరు పరదా. మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఇందులో లీడ్ రోల్ పోషించింది. రాగ్ మయూర్, సంగీత, దర్శన రాజేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా బండి, శుభం సినిమాల దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్ లో డిఫరెంట్ సినిమాలను ట్రై చేయాలనుకునేవారికి పరదా సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :